ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చిలకపాడులో శివాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. డీకే శివకుమార్ వెంట ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్‌తోపాటు పలువురు నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా.. కర్నాటక ఎన్నికల సమయంలో హార్డ్ వర్క్ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు డీకే శివకుమార్. డే అండ్ నైట్ కష్టపడి ప్రజల కోసం పనిచేస్తామని.. సమస్యలపై దృష్టి పెడతామని చెప్పారు. యువత, మహిళలు, ధరల పెరుగుదలపై ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. ప్రజలకు చెప్పింది చేస్తామని.. అన్ని హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. జనాలను మార్చాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసిందని.. అంతిమంగా ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కే పట్టంగట్టారన్నారు.
ఇక.. ఇటీవల షర్మిల తనతో భేటీ అయిన విషయంపై స్పందించారు డీకే శివకుమార్. షర్మిలతో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదన్నారు. షర్మిల తనకు సోదరిలాంటిదని.. కేవలం అభినందనలు తెలిపేందుకే తనను కలిశారని చెప్పారు. వైఎస్‌ఆర్, జగన్ కూడా తనకు సుపరిచితులేనన్నారు డీకే శివకుమార్. కార్యక్రమం అనంతరం.. మధురపూడి విమానాశ్రయం చేరుకుని అక్కడినుంచి బెంగళూరు వెళ్లారు. ఏదేమైనా.. డీకే శివకుమార్.. ఏపీ టూర్ మాత్రం రాజకీయంగా ఆసక్తిరేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..