బ్రేకింగ్: శ్రీ రెడ్డిపై పోలీస్ కేస్ పెట్టిన కరాటే కల్యాణి

| Edited By: Pardhasaradhi Peri

Feb 18, 2020 | 9:53 PM

శ్రీ రెడ్డిపై నటి కరాటే కల్యాణి.. సీసీఎస్‌ సైబర్ క్రైమ్‌లో పోలీస్ కేస్ పెట్టారు. తనను సోషల్ మీడియాలో అసభ్యకరంగా..

బ్రేకింగ్: శ్రీ రెడ్డిపై పోలీస్ కేస్ పెట్టిన కరాటే కల్యాణి
Follow us on

శ్రీ రెడ్డిపై నటి కరాటే కల్యాణి.. హైదరాబాద్ సీసీఎస్‌ సైబర్ క్రైమ్‌లో పోలీస్ కేస్ పెట్టారు. తనను సోషల్ మీడియా వేదికగా.. ఫేస్ బుక్‌ లై‌వ్‌లో అసభ్యకరంగా దూషిస్తున్నారని శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కరాటే కల్యాణి. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ విచారణ చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కంటెంట్స్ ప్రకారంగా 67 ఐటీ యాక్ట్, 506, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఈ తరహా కామెంట్స్ చేసినా.. వారికి సపోర్టింగ్‌గా కామెంట్స్ చేసినా చట్టరిత్యా నేరమని.. వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. కాగా.. గతంలో కూడా కరాటే కల్యాణి.. తనపై సోషల్ మీడియాలో వస్తోన్న అభ్యంతరకమైన పోస్ట్‌లు, కామెంట్స్ పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే ఎవరో ఇలా చేయిస్తున్నారని పేర్కొన్నారు.