ప్రముఖ హీరో, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ అధినేత కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ 2003లో ‘తొలి చూపులోనే’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత 2005లో వచ్చిన ‘అతనొక్కడే’ సినిమాతో కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘అసాధ్యుడు’, ‘విజయదశమి’, ‘లక్ష్మీకల్యాణం’, ‘ఓం 3డీ’, ‘ఇజం’, ‘పటాస్’, ‘118’ వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ‘టెంపర్’, ‘ఇజం’, ‘కిక్2’ వంటి సినిమాలు నిర్మించాడు. ఆదివారం కల్యాణ్‌రామ్ జన్మదినం సందర్భంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ విషెస్ చెప్పారు.
“నువ్వు నాకు అన్నవి మాత్రమే కాదు. ఎన్నో సంవత్సరాలుగా స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శకుడివి. హ్యాపీ బర్త్‌డే కల్యాణ్ అన్న. నువ్వు నిజంగా బెస్ట్” అంటూ ట్వీట్ చేశారు.
More than just being a brother, you’ve been my friend,philosopher and guide over the years. Happy Birthday Kalyan Anna @nandamurikalyan .You truly are the best!
— Jr NTR (@tarak9999) July 5, 2020
ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, బాబీ, రచయిత గోపీ మోహన్, కమెడియన్ వెన్నెల కిషోర్, కోన వెంకట్ తదితరులు కల్యాణ్‌రామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.