AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Driver Suicide: తీవ్ర విషాదం.. ఉద్యోగం నుంచి తీసేశారని ఆటోలో నిప్పంటించుకుని ఆత్మహత్య

కేరళలోని తిరువనంతపురంలో విషాదం జరిగింది.  ఉద్యోగంలో నుంచి తీసేశారన్న ఆవేదనతో ఓ ప్రైవేట్ పాఠశాల బస్ డ్రైవర్ స్కూల్ ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Bus Driver Suicide:  తీవ్ర విషాదం.. ఉద్యోగం నుంచి తీసేశారని ఆటోలో నిప్పంటించుకుని ఆత్మహత్య
Ram Naramaneni
|

Updated on: Jan 11, 2021 | 4:00 PM

Share

Bus Driver Suicide:  కేరళలోని తిరువనంతపురంలో విషాదం జరిగింది.  ఉద్యోగంలో నుంచి తీసేశారన్న ఆవేదనతో ఓ ప్రైవేట్ పాఠశాల బస్ డ్రైవర్ స్కూల్ ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటోలో కూర్చొని పెట్రోల్ పోసుకుని తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. కుమార్ అనే వ్యక్తి చెంబక స్కూల్‌ బస్సు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. కరోనా వ్యాప్తి సమయంలో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది పాఠశాల యాజమాన్యం. అయితే స్కూల్స్ రీ-స్టార్ట్ కాగానే శ్రీకుమార్ మళ్లీ విధుల్లో చేరడానికి వెళ్లాడు. కానీ అందుకు పాఠశాల సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆవేదనకు గురై.. ఆటోలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే అతడు సజీవదహనం అయ్యాడు. ఆటో కూడా పూర్తిగా కాలిపోయింది.

Also Read: New Covid strain in India: కలవరపెడుతున్న కొత్త రకం వైరస్ స్ట్రెయిన్.. ఇప్పటి వరకు 96 మందికి పాజిటివ్..!