Jio recharge: మరో కొత్త ప్లాన్‌తో యూజర్లను ఆక్టుకుంటోన్న రియలన్స్‌ జియో.. ఎంత రీఛార్జ్‌ చేయాలి.. బెన్‌ఫిట్స్‌ ఏంటి..

|

Jan 23, 2021 | 9:25 AM

Jio New Recharge Plan: టెలికాం రంగంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తూ దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో సరికొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. డేటా విషయంలో ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చిన జియో తాజాగా మరో కొత్త ప్లాన్‌ను..

Jio recharge: మరో కొత్త ప్లాన్‌తో యూజర్లను ఆక్టుకుంటోన్న రియలన్స్‌ జియో.. ఎంత రీఛార్జ్‌ చేయాలి.. బెన్‌ఫిట్స్‌ ఏంటి..
Follow us on

Jio New Recharge Plan: టెలికాం రంగంలో వినూత్న ఒరవడి సృష్టిస్తూ దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో సరికొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. డేటా విషయంలో ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చిన జియో తాజాగా మరో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త ప్లాన్‌తో వినియోగదారులు 84 రోజుల పాటు నిరంతరాయంగా ఏదైనా నెట్‌ వర్క్‌కు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా 6జీబీ డేటాతోపాటు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. రూ.329తో రీఛార్జ్‌ చేసుకుంటే ఈ ప్లాన్‌ యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌ ద్వారా యూజర్‌ పొందే బెన్‌ఫిట్‌ ఏంటంటే.. అన్ని జియో యాప్స్‌ను ఉచితంగా సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందవచ్చు. డేటా కంటే ఎక్కువగా కాల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ ప్లాన్‌ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ ఆఫర్‌ను మై జియో యాప్‌ లేదా జియో వెబ్‌సైట్‌లోకి వెళ్లి యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే జియో ఇటీవల.. రూ.153 జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్‌ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా అందంచేది, ప్రస్తుతం ఈ రీఛార్జ్ ప్లాన్ స్థానంలో జియో రూ.155 ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్‌ ద్వారా రోజుకు కేవలం 1జీబీ డేటాను అందిస్తోంది.

Also Read: Budget 2021: కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు.. వ్యవసాయం, ఆటో రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యత..