AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ వాడుతున్న కమలం ‘.. ఝార్ఖండ్ సైతం మిస్ ?

దేశంలో బీజేపీ హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఝార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాల ట్రెండ్ ను బట్టి చూస్తే.. మరో రాష్టాన్ని కూడా కమలం పార్టీ కోల్పోతున్న సూచనలు స్పష్టమవుతున్నాయి. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాలను ఈ పార్టీ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఝార్ఖండ్ ఐదో రాష్ట్రం కాబోతోందని అంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గత 12 నెలల్లో ప్రతిపక్షాల (కాంగ్రెస్) ధాటిని ఈ పార్టీ ఎదుర్కోలేక చతికిలబడింది. ఝార్ఖండ్ ఎన్నికల […]

' వాడుతున్న కమలం '.. ఝార్ఖండ్ సైతం మిస్ ?
Pardhasaradhi Peri
|

Updated on: Dec 23, 2019 | 5:29 PM

Share

దేశంలో బీజేపీ హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఝార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాల ట్రెండ్ ను బట్టి చూస్తే.. మరో రాష్టాన్ని కూడా కమలం పార్టీ కోల్పోతున్న సూచనలు స్పష్టమవుతున్నాయి. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాలను ఈ పార్టీ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఝార్ఖండ్ ఐదో రాష్ట్రం కాబోతోందని అంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గత 12 నెలల్లో ప్రతిపక్షాల (కాంగ్రెస్) ధాటిని ఈ పార్టీ ఎదుర్కోలేక చతికిలబడింది. ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల విషయానికే వస్తే.. సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు బీజేపీ 29 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి 40 స్థానాల్లో లీడ్ లో ఉంటూ వచ్చాయి. గత ఎన్నికల్లో బీజేపీకి మిత్ర పక్షమై.. ఇప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగిన ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉంది.

అలాగే మాజీ సీఎం బాబూలాల్ మరాండీ నేతృత్వంలోని ఝార్ఖండ్ వికాస్ మోర్చా కూడా నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగింది. 81 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 41 స్థానాలు. మహారాష్ట్రలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పార్టీకి, కాంగ్రెస్ కు మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ కీలక రాష్ట్రాల్లో కమలనాథులను కాంగ్రెస్ నేతలు దీటుగా ఓడించ గలిగారు. గత మే నెలలోజరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రాల్లో విజయం సాధించినా.. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఓటమి చవి చూస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఇది నాయకత్వ పటిమను కోల్పోతోందని తెలుస్తోంది. అలాగే.. ప్రధాని మోదీ కరిష్మాకూడా ఈ ఎన్నికల్లో కమలం పార్టీ విజయానికి తోడ్పడలేకపోతోందని అర్థమవుతోంది. ఝార్ఖండ్ లో బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోందంటే.. బహుశా ఇక్కడ గిరిజనేతరుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఈ పార్టీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో గిరిజన జనాభా ఎక్కువ. ఇది బీజేపీకి చుక్కెదురు కావడానికి మరో కారణమైంది. పైగా ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ తో తెగదెంపులు చేసుకోవాలన్న కమలం పార్టీ నిర్ణయం కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీల కూటమికి కలిసొచ్చింది. ఆ చీలిక ఈ కూటమికి ప్రయోజనకరమైంది.