మోదీ-షాల వ్యూహాలే.. బీజేపీకి ఎదురు దెబ్బలా.?

రాష్ట్ర ఎన్నికలు, జాతీయ ఎన్నికలు రెండూ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకదానిలో గెలుపొందామని.. మరోదానిలో సునాయాసంగా విజయం సాధిస్తామని అనుకోవడం పొరపాటే. ఇక సరిగ్గా ప్రస్తుతం ఝార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఈ థియరీని నిజం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు నమోదైన గణాంకాల ప్రకారం.. బీజేపీ పార్టీ ఝార్ఖండ్‌లో మెజార్టీని కోల్పోయే దిశగా సాగుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్-జేఎంఏం కూటమితో పోలిస్తే సుమారు 21 స్థానాల్లో వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ ఓటు శాతం కూడా దాదాపుగా తగ్గిపోయిందనే […]

  • Ravi Kiran
  • Publish Date - 5:29 pm, Mon, 23 December 19
మోదీ-షాల వ్యూహాలే.. బీజేపీకి ఎదురు దెబ్బలా.?

రాష్ట్ర ఎన్నికలు, జాతీయ ఎన్నికలు రెండూ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకదానిలో గెలుపొందామని.. మరోదానిలో సునాయాసంగా విజయం సాధిస్తామని అనుకోవడం పొరపాటే. ఇక సరిగ్గా ప్రస్తుతం ఝార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఈ థియరీని నిజం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

ఇప్పటివరకు నమోదైన గణాంకాల ప్రకారం.. బీజేపీ పార్టీ ఝార్ఖండ్‌లో మెజార్టీని కోల్పోయే దిశగా సాగుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్-జేఎంఏం కూటమితో పోలిస్తే సుమారు 21 స్థానాల్లో వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ ఓటు శాతం కూడా దాదాపుగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్‌తో పొత్తు పెట్టుకుని 14 లోక్‌సభ స్థానాలకు గానూ 13 గెలిచి 55 శాతం ఓటింగ్ మెజార్టీని పెంచుకున్నప్పటికీ .. రాష్ట్ర ఎన్నికల్లో మాత్రం  బీజేపీ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది.

ఒక్క ఝార్ఖండ్‌లోనే కాదు.. ఇలాంటి సిట్యువేషన్‌ని బీజేపీ గతంలో కూడా ఫేస్ చేసింది. అనూహ్య విధంగా కేంద్రంలో రెండోసారి భారీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి మహారాష్ట్ర, హర్యానాల్లో కూడా ఎదురుగాలి వీచింది. పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ.. రాజకీయ పండితులు నరేంద్ర మోదీ, అమిత్ షాలు మాత్రం ఈ వ్యతిరేకతను ఏమాత్రం ఊహించలేదనే చెప్పాలి.

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఎన్‌ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టం ఇలా ఎన్నో సరికొత్త ప్రయోగాలను మోదీ సర్కార్ చేసింది. అన్నీ కూడా దేశ అభివృద్ధి కోసమేనని వారు అంటున్నా.. ప్రజల నుంచి మాత్రం వ్యతిరేకత వస్తూనే ఉంది. ఈ విషయం ముఖ్యంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితం అవుతోంది. అంతేకాకుండా తాజాగా అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. అయినా కూడా కేంద్రం వెనక్కి తగ్గట్లేదు. బహుశా ఇది కూడా ఝార్ఖండ్ ఎన్నికల్లో ఈ పార్టీ చతికిల పడడానికి కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు.