స్టైల్ స్టైల్ రా.. ఇది తాతగారి సూపర్ స్టైల్ రా..!
సాధారణంగా వయస మీద పడిన ముసలివాళ్లు రామ, కృష్ణ అనుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ కాలం గడుపుతుంటారు. కాని జపాన్ కు చెందిన ఓ తాత తన ఫ్యాషన్‌తో ఇన్‌స్టోగ్రామ్ స్టార్‌గా మారాడు. పేరు తెత్సుయా. వయస్సు 84 ఏళ్లు. ఫ్యాషన్ అంటే పిచ్చి. రోజుకో స్టైల్, పూటకో గెటప్ వేస్తుంటాడు. తుత్సుయా రిటైర్డ్ కెమిస్ట్రీ టీచర్. ఓ సారి ఊరి నుంచి వచ్చిన మనవడు అతడికి ఫ్యాషన్ గురించి వివరించాడు. అప్పటినుంచి తెత్సుయాకు […]
సాధారణంగా వయస మీద పడిన ముసలివాళ్లు రామ, కృష్ణ అనుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ కాలం గడుపుతుంటారు. కాని జపాన్ కు చెందిన ఓ తాత తన ఫ్యాషన్‌తో ఇన్‌స్టోగ్రామ్ స్టార్‌గా మారాడు. పేరు తెత్సుయా. వయస్సు 84 ఏళ్లు. ఫ్యాషన్ అంటే పిచ్చి. రోజుకో స్టైల్, పూటకో గెటప్ వేస్తుంటాడు.
తుత్సుయా రిటైర్డ్ కెమిస్ట్రీ టీచర్. ఓ సారి ఊరి నుంచి వచ్చిన మనవడు అతడికి ఫ్యాషన్ గురించి వివరించాడు. అప్పటినుంచి తెత్సుయాకు ఫ్యాషన్ పై ఇంట్రస్ట్ కలిగింది. రోజూ కొత్త కొత్త బట్టలు వేసుకోవడం.. ఫోటోలకు ఫోజులివ్వడం అలవాటైపోయింది. తెత్సుయాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1,02,000 మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఫ్యాషన్ స్టార్‌గా మారిన తెత్సుయాను చూసి ఆయన స్టైల్‌ను ఫాలో అయ్యేవారు కూడా చాలామంది ఉన్నారు.