జపాన్ బుల్లెట్ ట్రెయిన్ డ్రైవర్ ‘కాక్ పిట్’ ను వదిలి, ఎక్కడికి వెళ్లాడంటే ? ప్రయాణికుల్లో క్షణం, క్షణం ..భయం..భయం

జపాన్ లో ఓ బుల్లెట్ ట్రెయిన్ అత్యంత వేగంగా..గంటకు 150 కి.మీ. వేగంతో వెళ్తోంది. కానీ డ్రైవర్ మాత్రం లేడు ..మరి ఎక్కడికి వెళ్లాడంటే..

జపాన్ బుల్లెట్ ట్రెయిన్ డ్రైవర్ 'కాక్ పిట్' ను వదిలి, ఎక్కడికి  వెళ్లాడంటే ? ప్రయాణికుల్లో క్షణం, క్షణం ..భయం..భయం
Japan Bullet Train Driver L
Follow us

| Edited By: Phani CH

Updated on: May 22, 2021 | 2:24 PM

జపాన్ లో ఓ బుల్లెట్ ట్రెయిన్ అత్యంత వేగంగా..గంటకు 150 కి.మీ. వేగంతో వెళ్తోంది. కానీ డ్రైవర్ మాత్రం లేడు ..మరి ఎక్కడికి వెళ్లాడంటే..టాయిలెట్ కి వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితి తలెత్తిందట. రైలు ఎంత సూపర్ ఫాస్ట్ గా వెళ్తున్నా..డ్రైవర్ కి చిన్న చిన్న శారీరక ‘అసౌకర్యాలు’ వస్తే వెళ్లక తప్పదు… ఇటీవల టోకైడో-షింకాన్ సెన్ రైల్వే లైనుపై బుల్లెట్ ట్రెయిన్ దూసుకుపోతుండగా ఉన్నట్టుండి డ్రైవర్ తన సీట్లోనుంచి లేచి టాయిలెట్ కి వెళ్ళాడు. కండక్టర్ ని కాస్త చూసుకోమని చెప్పి దాదాపు పరుగు తీశాడు. రైల్లో సుమారు 160 మంది ప్రయాణికులు ఉన్నారట..కొందరికి ఈ విషయం చూచాయగా మొదట తెలిసినా వెంటనే రైలంతా’అసలు సమాచారం’ తెలిసిపోయింది. దీంతో ప్యాసింజర్లంతా క్షణమో యుగంగా భయం భయంతో గడిపారు. అన్నట్టు ఆ డ్రైవర్ కి లైసెన్సు కూడా లేదట.. కానీ రైలు నడపాలని అధికారులు ఆదేశించారు. మొత్తానికి కొద్దిసేపటికి డ్రైవర్ రిలాక్స్ అయి వచ్చాడు. తనకు హఠాత్తుగా కడుపు నొప్పి రావదంతో వెళ్ళక తప్పలేదని ఆయన చెబుతున్నాడు. అదృష్టవశాత్తూ రైలు ఎలాంటి ప్రమాదానికి గురికాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా సదరు డ్రైవర్ మీద అధికారులు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోనున్నారట. ఎంత ఎమర్జెన్సీ అయినా డ్రైవర్ కాక్-పిట్ ని అంటి పెట్టుకునే ఉండాలని, వాతావరణం బాగులేని సందర్భాల్లో ఆ విషయాన్ని ట్రాన్స్ పోర్ట్ కమాండ్ సెంటర్ కి తెలియజేయాలని రూల్ ఉందని సీనియర్ అధికారులు వెల్లడించారు.

డ్రైవర్ కి లైసెన్స్ ఉన్న పక్షంలో కండక్టర్లు రైలు నడపవచ్చునని, ఇందుకు అనుమతి ఉందని వారు చెప్పారు. అయినా లైసెన్సు లేని డ్రైవర్ కి ఎందుకు అనుమతించారో తెలియడంలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: డైవింగ్‌ నేర్పుతున్న డాల్ఫిన్‌.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..

Viral Video: చపాతీలు ఇలా కూడా చేస్తారా..?? ఈ స్టైల్ చూసి ఫిదా ఆయన నెటిజన్లు.. ( వీడియో )