పవన్ కల్యాణ్‌కు తీవ్ర అనారోగ్యం.. తిరగపెట్టిన సమస్య..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా.. జనసేన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. తాను వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు.. అందుకే మీడియా సమావేశానికి రాలేకపోతున్నట్టు లెటర్‌లో పేర్కొన్నారు. తాజాగా.. విజయవాడలో ‘మీడియా’ సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొనాల్సిందిగా.. పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. అయితే.. ఆసమావేశానికి తాను హాజరుకాలేకపోతున్నానంటూ.. జనసేన పార్టీ తరుపున లెటర్‌లో తెలిపారు. ‘మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తోన్న పోరాటానికి జనసేన తరుపున.. నా మద్దతు […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా.. జనసేన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. తాను వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు.. అందుకే మీడియా సమావేశానికి రాలేకపోతున్నట్టు లెటర్‌లో పేర్కొన్నారు. తాజాగా.. విజయవాడలో ‘మీడియా’ సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొనాల్సిందిగా.. పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. అయితే.. ఆసమావేశానికి తాను హాజరుకాలేకపోతున్నానంటూ.. జనసేన పార్టీ తరుపున లెటర్‌లో తెలిపారు. ‘మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తోన్న పోరాటానికి జనసేన తరుపున.. నా మద్దతు తెలియజేస్తున్నా’ అని చెప్పారు.
గతంలో.. ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో.. ఆయనకు వెన్నుపూస వద్ద గాయాలు అయ్యాయి. అప్పటినుంచీ వెన్నునొప్పి సమస్య తలెత్తింది. ఆ తర్వాత.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది కొంచెం పెరగగా.. అప్పుడు.. ఫారిన్‌కు వెళ్లి తగిన చికిత్స తీసుకున్నారు. అయితే.. దాన్ని అశ్రద్ధ చేయడంతో.. వెన్ను నొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టింది. దీంతో.. ఆయన మూడు రోజుల నుంచి బయటకు రావడం లేదు. ఈ సందర్భంగా.. పలు కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడానికి విముఖత చూపిస్తున్నారు. తాజాగా.. ఆయన ‘సైరా నరసింహా రెడ్డి’ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అప్పటికే ఆయన బాధపడుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి డాక్టర్ల వద్ద ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని లెటర్‌లో తెలిపారు.
JanaSena Chief @PawanKalyan pic.twitter.com/uDfS20R41f
— JanaSena Party (@JanaSenaParty) September 26, 2019