ముందుంది మొసళ్ల పండగ : ఆర్టికల్ 370 రద్దుపై ఒమర్
ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ, ఇంకా కేంద్రం తీసుకున్న ఇతర నిర్ణయాలను నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని, చట్ట విరుధ్ధమని, కశ్మీర్ ప్రజలకు ద్రోహం చేసినట్టేనని ఆయన ఓ ప్రకటనలో మండిపడ్డారు. 1947 లో నాడు భారత ప్రభుత్వం ఈ అధికరణాన్నిఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాజాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రమాదకర పరిస్థితులకు దారి […]
ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ, ఇంకా కేంద్రం తీసుకున్న ఇతర నిర్ణయాలను నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని, చట్ట విరుధ్ధమని, కశ్మీర్ ప్రజలకు ద్రోహం చేసినట్టేనని ఆయన ఓ ప్రకటనలో మండిపడ్డారు. 1947 లో నాడు భారత ప్రభుత్వం ఈ అధికరణాన్నిఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాజాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తాయి. నిన్న (ఆదివారం) అఖిలపక్ష సమావేశం చేసిన హెచ్చరికల నేపథ్యంలో.. ప్రజల హక్కులను హరించే చర్య ఇది ‘ అన్నారు.అసలు కశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని తాము భావించామని, కానీ పెద్దఎత్తున ఈ రాష్ట్రంలో బలగాలను మోహరించిన అనంతరం ఈ ప్రకటన చేయడంలోని ఉద్దేశం అర్థమైందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ ను ఓ పెద్ద కోటలా మార్చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను మేం సవాలు చేస్తాం..భారీ ఎత్తున పోరాటం చేస్తాం.. అందుకు రెడీగా ఉన్నాం అని ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేశంగా వ్యాఖ్యానించారు.