లాక్ డౌన్ ఎఫెక్ట్: జలంధర్ లో అరుదైన దృశ్యం.. మొదటిసారిగా దర్శనమిచ్చిన..

| Edited By:

Apr 05, 2020 | 2:57 PM

ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తుంటే.. పంజాబ్ లోని జలంధర్ లో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. లాక్ డౌన్ వల్ల ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. వాహనాలు రోడ్లపైకి రావడం లేదు. అనేక పరిశ్రమలు కూడా

లాక్ డౌన్ ఎఫెక్ట్: జలంధర్ లో అరుదైన దృశ్యం.. మొదటిసారిగా దర్శనమిచ్చిన..
Follow us on

ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తుంటే.. పంజాబ్ లోని జలంధర్ లో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. లాక్ డౌన్ వల్ల ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. వాహనాలు రోడ్లపైకి రావడం లేదు. అనేక పరిశ్రమలు కూడా పనుల్ని ఆపేశాయి. జన సంచారం లేకపోవడంతో వన్య ప్రాణులు రోడ్లపై తిరుగుతున్నాయి. మరోపక్క గాలి స్వచ్ఛత రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రకృతి అందాల్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. దానికి నిదర్శనంగా ఇప్పుడు ఇంటర్నెట్ లో కొన్ని ఫొటో వైరల్ అవుతున్నాయి. దీంతో జలంధర్ నగరంలోని ప్రజలకు హిమాచల్ ప్రదేశ్ లోని ధౌలాధర్ మంచు కొండలు దర్శనమిచ్చాయి. ఈ అపురూప దృశ్యం కళ్లముందు కనపడంతో అక్కడి వాసులు తెగ సంబరపడుతున్నారు.

కాగా.. ఐ ఎఫ్ ఎస్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. ఫొటోను షేర్ చేస్తూ.. ‘జలంధర్ ప్రజలు మొదటిసారి ధౌలాధర్ కొండల్ని చూశారు. జలంధర్ నగరానికి 213 కిలోమీటర్ల దూరంలో ధౌలాధర్ కొండలు ఉన్నాయి. కాలుష్యం మనల్ని ఎలా గుడ్డివారిని చేసిందో చూడండి..’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫొటోకు తెగ లైక్లు, కామెంట్లు వచ్చారు. చాలా మంది రీట్వీట్ చేశారు.

మరోవైపు.. దిగ్గజ క్రికెటర్ హర్బజన్ సింగ్ ధౌలాధర్ మంచుకొండలు కనిపిస్తోన్న మరో ఫొటోను ట్వటర్ వేదికగా పంచుకున్నారు. ‘నా ఇంటి మేడ నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడూ ధౌలాధర్ మంచు కొండలు కనిపించలేదు. అది సాధ్యమౌతుందని ఎప్పుడూ అనుకోలేదు. మనం సృష్టిస్తున్న కాలుష్యం మాతృభూమిపై ఎలాంటి ప్రభావం చూపుతోందో స్పష్టంగా చెప్పే ఘటన ఇది’ అని ఆయన పేర్కొన్నారు.