Jabardasth Vs Adirindi: నాగబాబు ‘జబర్దస్త్’ ప్రోగ్రాంను విడిచి చాలా రోజులు అయింది. కారణాలు ఏదైనా షో నుంచి మెగా బ్రదర్ ఎగ్జిట్ అయిన తర్వాత రేటింగ్స్ పడిపోతాయని అందరూ భావించారు. ఇక అందరూ అనుకున్న విధంగానే కొన్ని రోజులు ఈ కామెడీ షో ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే రోజా పర్యవేక్షణలో ‘జబర్దస్త్’ క్రమేపి పుంజుకుని మళ్ళీ టీఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే నాగబాబుకు మల్లెమాల నిర్మాణ సంస్థతో విడదీయరాని బంధం ఉందని చెప్పాలి. ఆయన ‘ఆరంజ్’ సినిమాతో ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పుడు ‘జబర్దస్త్’కు జడ్జ్‌గా చేసే అవకాశం వచ్చింది. దానితో ఒక్కసారిగా నాగబాబు కెరీర్ ఊపందుకోవడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన జబర్దస్త్ షోను వదిలేసి జీ తెలుగుకు షిఫ్ట్ అయ్యారు.
అక్కడ ‘అదిరింది’ అనే కొత్త షోను మొదలుపెట్టి.. అన్నీ తానై చూసుకుంటున్నారు. ఓ కొత్త ప్రోగ్రాం పరంగా ఈ కామెడీ షోకు రేటింగ్స్ వస్తున్నా.. యూనిట్ ఊహించినంత రేటింగ్స్ మాత్రం రావట్లేదని టాక్. ‘గల్లీ బాయ్స్’ స్కిట్స్ తప్పితే మిగిలిన వారివి సోసోగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. మరి ‘జబర్దస్త్’ను బీట్ చేసేలా మెగా బ్రదర్ మున్ముందు ‘అదిరింది’ షోలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారో వేచి చూడాలి.
For More News:
ఉగ్రవాదులకు భయాన్ని పరిచయం చేసిన కరోనా.. ఆ పనులకు ఫుల్‌స్టాప్..
కొత్త జంటలకు విలన్‌గా కరోనా.. భారీగా నమోదైన విడాకుల కేసులు..
ఐపీఎల్ నిర్వహణకు మరో ఐదు తేదీలు..?
ఇండియాలో విజృంభిస్తున్న కరోనా.. దేశంలో నమోదైన కేసుల వివరాలు ఇవే..
Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..
కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్‌ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం