Hyper Aadi apologized : జబర్దస్త్ టీవీ షో ప్రముఖ నటుడు ఆది బతుకమ్మ, గౌరమ్మ వివాదంపై క్షమాపణలు చెప్పారు. తాము కావాలని ఎవరినీ కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదన్న ఆయన, ఒక వేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దానికి నిర్మోహమాటంగా క్షమాపణ కోరుతున్నానని వెల్లడించారు. అంతేయాదు, ఆ రోజు స్కిట్ లో పాల్గొన్న అందరి తరుపున కూడా క్షమాపణలు కోరుతున్నానని ఆది అన్నారు. శ్రీదేవి డ్రామాకంపెనీ షోలో తాము కావాలని చేసింది కాదని ఆయన అన్నారు. ఆంధ్ర, తెలంగాణ అనే బేధాబిప్రాయాలు మా షో లో లేవని ఆయన స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అందరి అభిమానాలు మాపై ఉన్నాయని అందుకే తమ షోలు అంతగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయని ఆయన అన్నారు. ఆది వివరణ పూర్తిపాఠం దిగువ వీడియోలో చూడొచ్చు..
ఇదిలాఉండగా, జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది పై ఎల్పీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. తెలంగాణ యాస, భాష సంస్కృతిని అవమానపరిచాడని.. బతుకమ్మ, గౌరమ్మలను కించపరుస్తూ మాట్లాడాడని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ.. హైపర్ ఆది మాటలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి. వెంటనే ఆది బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేదంటే.. తెలంగాణలో తిరగనివ్వం. షూటింగ్ స్ఫాట్ కి వెళ్లి హైపర్ ఆదిని అడ్డుకుంటాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ వివాదంపై హైపర్ ఆది అప్పుడే స్పందించారు. “నేను ఎక్కడ తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడ లేదు.. ఆ షో లో నేను కేవలం ఆర్టిస్ట్ ను మాత్రమే..ఆ స్క్రిప్ట్ నేను రాయలేదు.. బహుశ ఎడిటింగ్ తప్పిదం వల్ల పొరపాటు జరిగి ఉండవచ్చు.. నేను తెలంగాణ ప్రజలక్షమాపణకు సిద్ధం గా ఉన్నాను ” అని చెప్పారు హైపర్ ఆది.
ఇదిలా ఉంటే.. ఓ కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా హైపర్ ఆది మాట్లాడారని.. స్క్రీఫ్ట్ రైటర్.. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పై కూడా ఫిర్యాదు చేశారు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు. గతంలో కూడా ఆదిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఆది ఓ స్కిట్ చేశారని ఆరోపిస్తూ.. పలువురు అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ లు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడంతో వీడియో ద్వారా క్షమాపణలు కోరారు ఆది.
Read also : Vijayasai Reddy : చంద్రబాబు అందుకే విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు : విజయసాయి రెడ్డి