
టీడీపీ గవర్నమెంట్ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా పనిచేసి..వైసీపీ అధికార పగ్గాల చేపట్టగానే సస్పెన్షన్‌కు గురైన సివిల్ సర్వీసెస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌కు ఇప్పుడు ప్రమోషన్ లభించింది. ఆయనకు ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్ అధికారిగా ప్రమోషన్ ఇస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ నెల 25 నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.
కృష్ణ కిషోర్ హయంలో ఈడీబీలో పలు అవకతవకలు జరిగాయంటూ జగన్ సర్కార్ ఆయనపై వేటు వేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాతి కాలంలో క్యాట్ ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేసింది. తిరిగి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు క్యాట్ అనుమతి ఇచ్చింది.