ఇక ఆన్‌లైన్‌లో పాలసీలు జారీ: ఐఆర్‌డీఏఐ

ఆన్‌లైన్‌లో పాలసీల జారీకి జీవిత భీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో.. సాధారణ వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో

ఇక ఆన్‌లైన్‌లో పాలసీలు జారీ: ఐఆర్‌డీఏఐ
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2020 | 11:17 AM

ఆన్‌లైన్‌లో పాలసీల జారీకి జీవిత భీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో.. సాధారణ వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసే అన్ని పాలసీలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో పాలసీ పత్రాల ముద్రణ, చేరవేయడంలో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తమకు ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, ఎలక్ట్రానిక్ పాలసీ పత్రాల జారీ ద్వారా వ్యాపారం చేసే డిజిటల్ మార్గాలను అవలంబించే తమ ప్రణాళికను ఐఆర్‌డీఏఐకి తెలియజేసినట్లు పాలసీ సంస్థలు తెలిపాయి. ఐఆర్‌డీఏఐ తన ఇ-ఇన్సూరెన్స్ పాలసీ రెగ్యులేషన్స్, 2016 లో, రెగ్యులేషన్ యొక్క క్లాజ్ 4 (iii) ద్వారా భౌతిక రూపంలో జారీపై మినహాయింపు ఇచ్చే అధికారాన్ని ఉపయోగించుకుంది.

Read More:

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్