ఇంగ్లాండ్‌కు షాక్.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్..!

వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు ఐర్లాండ్ షాకిచ్చింది. మూడో వన్డేలో అద్భుతమైన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.

ఇంగ్లాండ్‌కు షాక్.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్..!

Ireland Memorable Win: వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు ఐర్లాండ్ షాకిచ్చింది. మూడో వన్డేలో అద్భుతమైన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన ఇంగ్లాండ్.. మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించగా.. ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ అద్భుతంగా పోరాడి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 328 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అజేయ సెంచరీకి.. టామ్ బాంటన్ అర్ధ శతకం తోడవ్వడంతో భారీ స్కోర్ చేయగలిగింది. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్ 3 వికెట్లు పడగొట్టగా.. లిటిల్, క్యాంపేర్ రెండేసి వికెట్లు, డెలనీ ఒక్క వికెట్ తీశారు.

లక్ష్యఛేదనలో భాగంగా ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌(142: 128 బంతుల్లో 9ఫోర్లు, 6సిక్సర్లు), కెప్టెన్‌ ఆండ్రూ బాల్బిర్నీ(113: 112 బంతుల్లో 12ఫోర్లు) భారీ శతకాలతో చెలరేగారు. దీనితో 329 పరుగుల టార్గెట్‌ను అలవోకగా మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో ఇంగ్లాండ్ కైవసం చేసుకోగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు స్టిర్లింగ్‌కు, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు డేవిడ్ విల్లేకు దక్కింది.

Click on your DTH Provider to Add TV9 Telugu