ఇరాన్‌లో ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ చెందిన బోయింగ్ విమానం కూలిన ఘటనలో 176 మంది ప్రాణాలు విడిచారు. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు రేకెత్తున్నాయి. సాంకేతిక సమస్యల వల్లే కూలిపోయిందా..? లేక ఎవరైనా కావాలనే కూల్చేశారా? అన్న కోణంలో ఉక్రెయిన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇరాన్-అమెరికాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్న క్రమంలో, ఇరాన్ సంధించిన క్షిపణి ఫ్లైట్‌ను ఢీకొట్టి ఉండొచ్చని ఉక్రెయిన్ అభిప్రాయపడుతోంది.
అందుకే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమర్ జెలెన్‌స్కీ అధికారులను ఆదేశించారు. అంతకముందు వరకు విమాన ప్రమాదానికి కారణం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని ఉక్రెయిన్ ఎంబసీ తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. కానీ దేశాధ్యక్షుడు విచారణకు ఆదేశించడంతో, వెంటనే ఆ ప్రకటనను తొలగించింది. ఇక పొరపాటున ఇరాన్ క్షిపణి ఢికొనడం వల్ల విమానం కూలిపోయిందంటూ, ఇరాన్‌కు చెందిన “జోర్దానియన్ అల్ హదత్” వార్తా పత్రిక ఓ కథనం ప్రసారం చేసినట్టు ఉక్రెయిన్ న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఇక విమాన ప్రమాదంపై విచారణ చేసేందుకు ఉక్రెయిన్ నుంచి ఎక్స్‌పర్ట్స్ గ్రూప్ ఇరాన్ చేరుకుంది.
ఇరాన్, ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేసిందని అమెరికా బలంగా నమ్ముతోంది. అది ప్రమాదవశాత్తూ జరిగి ఉండొంచ్చంటూ అభిప్రాయపడింది. ఇక ఇదే వాదనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సమర్ధించారు. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని, అందుకు ఆధారాలు కూడా ఉన్నట్లు ట్రూడో స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఈ తరహా ప్రకటనలే చేశారు. మరి ఈ విషయంపై మున్ముందు ప్రపంచ దేశాల మధ్య ఎటువంటి ముసలం ముసురుకుంటదన్నదానిపై టెన్షన్ నెలకుంది.
#Breaking: Just in – Confirmed video footage of the moment the Ukrainian Boeing had been shot down by Iranian air defence systems. #Iran #Iraq #US #Ukraine pic.twitter.com/qVhUiCT7nf
— Sotiri Dimpinoudis (@sotiridi) January 9, 2020