DC vs MI, IPL 2024: 2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ఇలాగైతే టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ కష్టమే

Delhi Capitals vs Mumbai Indians:  ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న 42వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ అవకాశాన్ని ఢిల్లీ పూర్తిగా సద్వినియోగం చేసుకుని శుభారంభం చేసింది. ఓపెనింగ్ జోడీ అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ముంబై బౌలర్ల పై విరుచుకు పడ్డారు

DC vs MI, IPL 2024: 2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ఇలాగైతే టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ కష్టమే
Hardik Pandya
Follow us

|

Updated on: Apr 27, 2024 | 6:55 PM

Delhi Capitals vs Mumbai Indians:  ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న 42వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ అవకాశాన్ని ఢిల్లీ పూర్తిగా సద్వినియోగం చేసుకుని శుభారంభం చేసింది. ఓపెనింగ్ జోడీ అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ముంబై బౌలర్ల పై విరుచుకు పడ్డారు. నాలుగో ఓవర్‌లో జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ హాఫ్ సెంచరీ సాధించాడు. అలాగే ఓపెనింగ్ జోడీ మెక్‌గుర్క్, పోరెల్ 7.3 ఓవర్లలోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొత్తానికి పోరెల్-మెక్‌గర్క్ 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఢిల్లీ జట్టుకు మంచి శుభారంభం అందించారు. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ముంబై నంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను సైతం విడిచిపెట్టలేదు. ఇక ఢిల్లీ ఓపెనర్ల ధాటికి హార్దిక్ పాండ్యా కూడా డీలా పడిపోయాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ కేవలం 2 ఓవర్లలోనే 41 పరుగులు ఇచ్చాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్‌లో ఐదు, ఏడో ఓవర్లను పాండ్యా వేశాడు. పాండ్యా ఐదో ఓవర్‌లో 20 పరుగులు, ఏడో ఓవర్‌లో 21 పరుగులు చేశాడు. మొత్తం 2 ఓవర్లలో 20.50 ఎకానమీ రేటుతో పాండ్యా 41 పరుగులు సమర్పించుకున్నాడు హార్దిక్. దీంతో అతనిపై సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతోంది.

హార్దిక్ వేసిన ఐదో ఓవర్లో జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ ఏడో ఓవర్ తొలి 5 బంతుల్లో 4, 6, 5 పరుగులు చేశాడు. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ చివరి బంతికి సిక్సర్ బాదాడు. దీంతో ఏడో ఓవర్లో హార్దిక్ 21 పరుగులు ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కుమార్ కుషాగ్రా, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్, కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాద్ విలియమ్స్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రసిఖ్ దార్ సలామ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, రికీ భుయ్, సుమిత్ కుమార్.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, ల్యూక్ వుడ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, షామ్స్ ములానీ, డెవాల్డ్ బ్రీవిస్, కుమార్ కార్తికేయ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో అదిరే లాభాలు..ఏడాదిలోనే పెట్టుబడి డబుల్
ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో అదిరే లాభాలు..ఏడాదిలోనే పెట్టుబడి డబుల్
లిక్కర్‌ స్కామ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
లిక్కర్‌ స్కామ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
ఢిల్లీకి ఉపాసనతో రామ్ చరణ్.. ఐఏఎస్ లుక్ అదిరిపోయింది
ఢిల్లీకి ఉపాసనతో రామ్ చరణ్.. ఐఏఎస్ లుక్ అదిరిపోయింది
ఈ టిప్స్ పాటిస్తే.. మీ కారు పాతదైనా.. కొత్తగా పరుగులు పెడుతుంది..
ఈ టిప్స్ పాటిస్తే.. మీ కారు పాతదైనా.. కొత్తగా పరుగులు పెడుతుంది..
మరో 2 రోజుల్లో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ప్రిలిమినరీ 'కీ' విడుదల
మరో 2 రోజుల్లో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ప్రిలిమినరీ 'కీ' విడుదల
సీఎం రేవంత్‌ రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ
సీఎం రేవంత్‌ రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ
మైగాడ్‌.. అమెరికాలో మరో భారత సంతతి విద్యార్ధి అదృశ్యం!
మైగాడ్‌.. అమెరికాలో మరో భారత సంతతి విద్యార్ధి అదృశ్యం!
జంక్ ఫుడ్ తినడం ప్రాణాంతకం.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..
జంక్ ఫుడ్ తినడం ప్రాణాంతకం.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..
మందుబాబులూ అలర్ట్‌.. ఈ రెండు రోజులు వైన్స్‌ షాప్స్‌ బంద్‌..
మందుబాబులూ అలర్ట్‌.. ఈ రెండు రోజులు వైన్స్‌ షాప్స్‌ బంద్‌..
ఆ కామెంట్స్ పై జయమ్మ సీరియస్..
ఆ కామెంట్స్ పై జయమ్మ సీరియస్..