Varalaxmi Sarathkumar: మా గురించి అలా మాట్లేందుకు మీరెవరు..? వరలక్ష్మి శరత్ కుమార్ ఫైర్..

. ఇప్పుడు శబరి అనే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే.. సినిమాల్లో వరలక్ష్మి పాత్రలు ఎంత రఫ్ గా ఉంటాయో.. రియల్ లైఫ్ లోనూ అంతే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చే కామెంట్స్.. విమర్శల పట్ల గట్టిగానే స్పందిస్తుంటారు. తాజాగా తన ఫ్యామిలీ గురించి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ పై ఫైర్ అయ్యిం

Varalaxmi Sarathkumar: మా గురించి అలా మాట్లేందుకు మీరెవరు..? వరలక్ష్మి శరత్ కుమార్ ఫైర్..
Varalaxmi Sarathkumar
Follow us

|

Updated on: May 09, 2024 | 2:51 PM

సౌత్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చిన నటి వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్‏గా దక్షిణాది సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు పవర్ఫుల్ విలన్‏గా మెప్పిస్తుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలోనూ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు శబరి అనే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే.. సినిమాల్లో వరలక్ష్మి పాత్రలు ఎంత రఫ్ గా ఉంటాయో.. రియల్ లైఫ్ లోనూ అంతే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చే కామెంట్స్.. విమర్శల పట్ల గట్టిగానే స్పందిస్తుంటారు. తాజాగా తన ఫ్యామిలీ గురించి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ పై ఫైర్ అయ్యింది.

నటుడు శరత్ కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. వీరికి వరలక్ష్మి జన్మించింది. కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోవడంతో సీనియర్ నటి రాధికను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి రాహుల్ అనే బాబు జన్మించారు. ప్రస్తుతం శరత్ కుమార్ మొదటి భార్య, రెండో భార్య అంతా కలిసి సన్నిహితంగానే ఉంటున్నారు. పార్టీస్, ఫంక్షన్లలో కలిసి పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన వరలక్ష్మీ నిశ్చితార్థ వేడుకలోనూ రెండు కుటుంబాలు కలిసి ఎంతో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధంచిన ఫోటోస్ నెట్టింట వైరల్ కాగా.. కొందరు నెటిజన్స్ శరత్ కుమార్ రెండు కుటుంబాలపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి నెగిటివ్ కామెంట్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఒకరి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసేముందు మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి సీరియస్ అయ్యింది.

నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని మాట్లాడటం కంటే.. మీరెందుకు చేయడం లేదని ఆలోచించండి. ప్రపంచంలో నటీనటులకు చాలా తక్కువగా పారితోషికం ఉంటుంది. అది కూడా కేవలం షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే అతడు ఎన్ని అడ్డంకులు, కష్టాలు ఎదుర్కొన్నాడో మీకు తెలుసా ?.. సెలబ్రెటీలు ఎప్పుడూ సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటారని అంటారు.. కానీ ఎవరికీ అలాంటి పరిస్థితి ఉండదు. పారితోషికం ఒక్కసారే వస్తుంది. షూటింగ్ ఆగిపోతే రాదు. మా పని అంత సులభం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
2బీహెచ్‌కే ఇంటి అద్దె నెలకు ఏకంగా రూ. 90వేలు..
2బీహెచ్‌కే ఇంటి అద్దె నెలకు ఏకంగా రూ. 90వేలు..
అప్పుడు ఆర్డనరీ భామ.. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆర్డనరీ బ్యూటీ
అప్పుడు ఆర్డనరీ భామ.. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆర్డనరీ బ్యూటీ
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మతిస్థిమితంలేదనీ.. కన్నబిడ్డకి ఉరేసి హతమార్చిన తల్లిదండ్రులు
మతిస్థిమితంలేదనీ.. కన్నబిడ్డకి ఉరేసి హతమార్చిన తల్లిదండ్రులు
క్యాబ్‌ డ్రైవర్లతో తస్మాత్‌ జాగ్రత్త! నకిలీ యాప్‌తో మోసాలు..
క్యాబ్‌ డ్రైవర్లతో తస్మాత్‌ జాగ్రత్త! నకిలీ యాప్‌తో మోసాలు..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బీపీకి, స్మార్ట్‌ఫోన్‌కి మధ్య సంబంధం.. పరిశోధనల్లో సంచలన విషయాలు
బీపీకి, స్మార్ట్‌ఫోన్‌కి మధ్య సంబంధం.. పరిశోధనల్లో సంచలన విషయాలు
పాన్ ఇండియా ట్రెండ్ తో ఫ్యాన్స్‌కు హీరోలు దూరం అవుతున్నారా..
పాన్ ఇండియా ట్రెండ్ తో ఫ్యాన్స్‌కు హీరోలు దూరం అవుతున్నారా..
ఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వనున్న సిట్
ఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వనున్న సిట్