అంతకుముందులా కాదు.. ఇప్పుడు బాలీవుడ్‌లో పరిస్థితులు మారాయి.: అలియా భట్

Anil Kumar

07 June 2024

అలియా భట్.. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు.. బాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్.

ఇండియాలోనే టాప్ రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో అలియా భట్ కూడా ఒకరు. తాజాగా అమ్మగా ప్రమోషన్ అయ్యింది.

వరస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా సైతం ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

తాజాగా మాట్లాడుతూ బాలీవుడ్‌లో ఇప్పుడు పరిస్థితులు కంప్లీట్ గా మారిపోయాయని అంటున్నారు హీరోయిన్ ఆలియా.

ఓటీటీల వల్ల ఎంతో మార్పు వచ్చిందని.. థియేటర్స్ కు వచ్చే ఆడియన్స్ సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది.. అన్నారు.

అయితే తనకు మాత్రం కెమెరానే లోకమని, సినిమాలే ధ్యేయం అని.. అది తప్ప ఇంకో ప్రపంచం తెలియదని అన్నారు ఆలియా.

ఇండస్ట్రీలో అడుగుపెట్టి పుష్కరం అయిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొని ఉన్నానని..

టాలెంట్ తో తనను తాను ప్రూవ్‌ చేసుకునే క్యారెక్టర్స్ నే ఇకపై కూడా సెలక్ట్ చేసుకుంటానని అన్నారు ఆలియా.