గ్లామర్‌ గాలా.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కియారా అద్వానీ హడావుడి.

Anil Kumar

19 May 2024

టాలీవుడ్ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా భరత్ అనే నేను అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది కియారా అద్వానీ.

ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.. తన గ్లామర్ తో నటనతో ఆడియన్స్ బాగా అట్ట్రాక్ట్ చేసింది.

ఇక బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ వయ్యారి అక్కడ వరస అవకాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అనే చెప్పాలి.

ఇదిలా ఉంటె ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ఫాలోయింగ్ వేరే లెవల్.. ఈమె ఫొటోస్ కోసం యూత్ వెయిట్ చేస్తుంటారు.

ఇక తాజాగా హీరోయిన్ కియారా అద్వానీ ఫ్రాన్స్ లో జరిగే ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరయ్యారు.

రెడ్‌ సీ ఫిల్మ్ వారి విమెన్‌ ఇన్‌ సినిమా గాలా డిన్నర్‌కి మన దేశం తరఫున కియారా ప్రాతినిథ్యం వహిస్తారు.

వ్యానిటీ ఫెయిర్‌ హోస్ట్ చేసే ఈ ఈవెంట్‌లో పలు దేశాలకు చెందిన ఆరుగురు ప్రతిభావంతులైన నటులు హాజరయ్యారు.

ఈ నెల 18న ఈ వేడుక ఘనంగా మొదలైయ్యింది. దీనికి మన దేశం నుండి పలువురు టాప్ బీ టౌన్ హీరోయిన్స్ హాజరయ్యారు.