పెళ్లికి సిద్ధమైన అనుష్క.. ఆ నిర్మాతతో కలిసి ఏడడుగులు

TV9 Telugu

19 May 2024

తెలుగు, తమిళం, కన్నడ.. ఇలా దక్షిణాది భాషా సినిమాల్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది మంగళూరు బ్యూటీ అనుష్కా శెట్టి.

కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలకే సై అంది.

గతేడాది మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది అనుష్క. ఇందులో ఆమె అభినయం ప్రశంసలు అందుకుంది.

ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ల లిస్టులో అనుష్కా శెట్టి కూడా ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 42 సంవత్సరాలు

దీంతో సహజంగానే స్వీటి పెళ్లి గురించి అప్పుడప్పుడు రూమర్లు వినిపిస్తుంటాయి. అయితే ఇవేవీ నిజం కాలేదు.

ఇప్పుడు మళ్లీ అనుష్క పెళ్లిపై రూమర్లు ఊపందుకున్నాయి. ఓ కన్నడ నిర్మాతతో స్వీటీ ఏడడుగులు నడవనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరి ఇది కూడా కేవలం రూమరేనా? లేకపోతే అనుష్క నిజంగానే పెళ్లిపీటలెక్కుతుందా? అన్నది రాబోయే రోజుల్లో తెలియనుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం క్రిష్ జాగర్ల మూడీ దర్శకత్వంలో  ఓ లేడి ఓరియంటెడ్ కాన్సెప్ట్ మూవీలో నటిస్తోంది అనుష్క.