19 May 2024

బుట్టబొమ్మకు బంపర్ ఆఫర్.. కోలీవుడ్ స్టార్ హీరో సరసన పూజా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు సైలెంట్ అయ్యింది. తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించట్లేదు ఈ బ్యూటీ. 

తెలుగులో అప్పటికే ఒప్పుకున్న సినిమాలు.. వచ్చిన ఆఫర్స్ వదిలేస్తూ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది పూజా. కానీ ఈ అమ్మడుకు అక్కడ కూడా నిరాశే మిగిలింది.  

హిందీలో ఈ బ్యూటీ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. చివరగా సల్మాన్ సరసన కిసి కీ భాయ్ కిసీ కా జాన్ సినిమా డిజాస్టర్ అయ్యింది. 

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న పూజా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది ఈ బుట్టబొమ్మ. 

తాజాగా పూజాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుందట. 

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన పూజా నటించనుందని టాక్ వినిపిస్తుంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

 2డి ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ తొలి వారం నుంచి అండమాన్ దీవుల్లో చిత్రీకరణ స్టార్ట్ కానుందట. 

 ఇక ఈ సినిమాలో సూర్య సరసన పూజ నటించనుందని టాక్ వినిపిస్తుంది. ఇదే విషయంపై ఇప్పటికే పూజాతో మేకర్స్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.