ధోని ఖాతాలో సిక్సర్ల రికార్డు..
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఖాతాలోకి మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ టోర్నీలో 300 సిక్సులు బాదిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా అరుదైన క్లబ్‌లో చేరాడు.

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఖాతాలోకి మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ టోర్నీలో 300 సిక్సులు బాదిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా అరుదైన క్లబ్‌లో చేరాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న జరిగిన మ్యాచ్‌లో చాహల్ బౌలింగ్‌లో సిక్సు కొట్టి.. ధోని ఈ ఫీట్ సాధించాడు. అత్యధిక సిక్సర్ల జాబితాలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(375) అగ్రస్థానంలో ఉండగా.. సురేష్ రైనా(311) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా క్రిస్ గేల్(404 సిక్సర్లు) నెంబర్ 1గా కొనసాగుతున్నాడు.
కాగా, చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఐపీఎల్‌లో స్థాయికి తగ్గట్టు ప్రదర్శన కనబరచట్లేదు. ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదింటిలో ఓటమిపాలై.. కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసుకుంది. సీఎస్కే బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. ధోని, వాట్సన్, డుప్లెసిస్ ఇలా దిగ్గజాలు ఉన్న ఇంకా ఆ జట్టు విజయాలు అందుకోవట్లేదు.
Also Read:




