చిదంబరానికి మరోసారి కస్టడీ పొడిగింపు

కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం కస్టడీ గడువును సుప్రీం కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియాకు అక్రమ మార్గాల్లో నిధులు తరలింపు కేసులో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో చిదంబరానికి నాలుగు రోజులపాటు కస్టడీ విధించగా గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో మరోసారి ఆయనకు కస్టడీ పొడిగించడంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 2 వరకు ఆయనకు కస్టడీ గడువును పొడిగించింది. చిదంబరంను ఢిల్లీలోని జోర్ […]

చిదంబరానికి మరోసారి  కస్టడీ  పొడిగింపు

Edited By:

Updated on: Aug 30, 2019 | 6:55 PM

కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం కస్టడీ గడువును సుప్రీం కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియాకు అక్రమ మార్గాల్లో నిధులు తరలింపు కేసులో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో చిదంబరానికి నాలుగు రోజులపాటు కస్టడీ విధించగా గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో మరోసారి ఆయనకు కస్టడీ పొడిగించడంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 2 వరకు ఆయనకు కస్టడీ గడువును పొడిగించింది.

చిదంబరంను ఢిల్లీలోని జోర్ బాగ్ వద్ద గల ఆయన నివాసం వద్ద సీబీఐ అధికారులు ఆగస్టు 21న అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసే సమయంలో సీబీఐ అధికారులు ఏకంగా ఇంటి కాంపౌండ్ గోడ దూకి మరీ అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. మరుసరి రోజు ఆగస్టు 22న సీబీఐ కోర్టుకు తరలించారు.