AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పీకర్ ఆదేశాలకు సీఎం ఫిదా: విచారణ ఖాయం

గత ఆరు నెలలుగా ఏపీవ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్న అంశంపై విచారణ ఖాయమని సోమవారం శాసనసభ వేదికగా తేలిపోయింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ సభాముఖంగా జారీ చేసిన ఆదేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే ఓకే చెప్పారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసే ముందు పలువురు టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో సుమారు వేలాది ఎకరాలను ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేశారని వైసీపీ నేతలు ఎన్నికల ముందు నుంచి ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం […]

స్పీకర్ ఆదేశాలకు సీఎం ఫిదా: విచారణ ఖాయం
Rajesh Sharma
| Edited By: |

Updated on: Jan 20, 2020 | 2:35 PM

Share

గత ఆరు నెలలుగా ఏపీవ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్న అంశంపై విచారణ ఖాయమని సోమవారం శాసనసభ వేదికగా తేలిపోయింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ సభాముఖంగా జారీ చేసిన ఆదేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే ఓకే చెప్పారు.

అమరావతిని రాజధానిగా ఎంపిక చేసే ముందు పలువురు టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో సుమారు వేలాది ఎకరాలను ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేశారని వైసీపీ నేతలు ఎన్నికల ముందు నుంచి ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పట్నించి ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తరచు ఆరోపణలపర్వం నడుస్తూనే వుంది. తాజాగా డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలు సుమారు 4 వేల ఎకరాలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ విధానంలో కొన్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో వెల్లడించారు. దానికి సంబంధించిన వివరాలను మీడియాకు కూడా అందజేశారు ఆర్థిక మంత్రి.

ఈ నేపథ్యంలో మరోసారి టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్ళ పర్వం మొదలైంది. నెల రోజులుగా రాజధాని ఉద్యమం అమరావతి ఏరియాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానికి సంఘీభావం ప్రకటించారు టీడీపీ నేతలు. అయితే టీడీపీ నేతలు తమ భూముల కోసమే రైతులను రెచ్చగొడుతున్నారంటూ వైసీపీ లీడర్లు ఆరోపిస్తూ వచ్చారు.

తాజాగా జనవరి 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల తొలి రోజున ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సవాళ్ళ పర్వం జోరుగా సాగుతున్నందున నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని స్పీకర్ హోదాలో తమ్మినేని సీతారామ్ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చారు. స్పీకర్ డైరెక్షన్‌పై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై విచారణకు జరిపిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో ప్రకటించారు.

నిజానికి గత వారం రోజులుగా ఇన్‌సైడర్ ఆరోపణలపై ఏపీ సీఐడి విచారణ జరగనున్నట్లు కథనాలు వస్తూనే వున్నాయి. దానికి కొనసాగింపుగానే ఇవాళ్టి ముఖ్యమంత్రి ప్రకటన అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.