ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్: విశాఖకు వచ్చేవి ఇవే
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నెల రోజుల క్రితం చేసిన ప్రకటనే యాజ్ ఇట్ ఈజ్‌గా సోమవారం అసెంబ్లీ ముందుకు బిల్లు రూపంలో వచ్చింది. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించిన కేబినెట్.. దాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. విశాఖను.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిని లిజిస్టేటివ్ క్యాపిటల్, కర్నూలును జ్యూడిషియల్ క్యాపిటల్‌గా ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బిల్లును ప్రవేశపెట్టారు. విశాఖే అన్నింటికన్నా ముఖ్యం మూడు రాజధానుల ప్రతిపాదనలో విశాఖపట్నం నగరానికే […]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నెల రోజుల క్రితం చేసిన ప్రకటనే యాజ్ ఇట్ ఈజ్‌గా సోమవారం అసెంబ్లీ ముందుకు బిల్లు రూపంలో వచ్చింది. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించిన కేబినెట్.. దాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. విశాఖను.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిని లిజిస్టేటివ్ క్యాపిటల్, కర్నూలును జ్యూడిషియల్ క్యాపిటల్‌గా ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బిల్లును ప్రవేశపెట్టారు.
విశాఖే అన్నింటికన్నా ముఖ్యం
మూడు రాజధానుల ప్రతిపాదనలో విశాఖపట్నం నగరానికే ఎక్కువ ప్రయోజనమని తేటతెల్లమైంది. అయితే గతంలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూపులిచ్చిన నివేదిక నుంచి ఒకట్రెండె అంశాలను మాత్రం మినహాయించినా… సచివాలయం, రాజ్‌భవన్, అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతుల కార్యాలయాలు.. ఇలా అన్నీ విశాఖ నగరంలోనే ఏర్పాటు కానున్నాయి. శాసనసభా కార్యకలాపాలు నిర్వహించే సచివాలయం మాత్రం అమరావతిలో ఏర్పాటు కానుంది. అంటే.. సంవత్సరానికి మూడు, నాలుగు సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాల సమయంలో తప్ప మిగితా అధికారిక కార్యక్రమాలన్నీ విశాఖలోనే జరుగుతాయి. సచివాలయం సెలవు దినాలు మినహా సంవత్సరం పొడవునా.. యాక్టివ్‌గా వుంటుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ విశాఖ నగరంపైనే అన్నది నిర్వివాదాంశం.