AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దులో పావురం కలకలం – పాకిస్తాన్ కుట్రను చేధించిన భారత్..!

కరోనాతో ప్రపంచం ఓ వైపు అతలాకుతమవుతుంటే.. దాయాది దేశం పాకిస్తాన్ కుయుక్తులకు పాల్పడుతోంది. పాకిస్తాన్‌ గూఢచార పావురాన్ని మన దేశానికి పంపి మన గుట్టు తెలుసుకునేందుకు పన్నాగం పన్నింది. దీంతో అలర్టైన భద్రతా సిబ్బంది పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక గూఢచార పావురాన్నికథువా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్‌ సరిహద్దులో సోమవారం ఈ పావురం దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ పావురం కాలికి చిన్న రింగు, ఆ రింగు మీద కోడ్‌ […]

సరిహద్దులో పావురం కలకలం - పాకిస్తాన్ కుట్రను చేధించిన భారత్..!
Balaraju Goud
|

Updated on: May 25, 2020 | 7:41 PM

Share

కరోనాతో ప్రపంచం ఓ వైపు అతలాకుతమవుతుంటే.. దాయాది దేశం పాకిస్తాన్ కుయుక్తులకు పాల్పడుతోంది. పాకిస్తాన్‌ గూఢచార పావురాన్ని మన దేశానికి పంపి మన గుట్టు తెలుసుకునేందుకు పన్నాగం పన్నింది. దీంతో అలర్టైన భద్రతా సిబ్బంది పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక గూఢచార పావురాన్నికథువా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్‌ సరిహద్దులో సోమవారం ఈ పావురం దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ పావురం కాలికి చిన్న రింగు, ఆ రింగు మీద కోడ్‌ నెంబర్లు ఉండటంతో అది కచ్చితంగా పాకిస్తాన్‌ గూఢచార పావురమేనని పోలీసులు చెబుతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులకు హిరానగర్‌ సెక్టార్‌ వద్ద ఒక పావురం కిందపడిపోయి కనిపించింది. వారు ఆ పావురాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఆ పావురం పాకిస్తాన్‌ వైపు ఎగురుతూ కింద పడిపోయిందని మన్యారి గ్రామస్తులు తెలిపారు. ఆ పావురాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు దాని కాలుకు ఉన్న చిన్న రింగు కంటపడింది. ఆ రింగుపై ప్రత్యేక కోడింగ్‌తో కూడిన సంఖ్యలు ఉండటంతో అది పాకిస్తాన్‌ గూఢచార కపోతంగా కథువా జిల్లా ఎస్పీ శైలేంద్రమిశ్రా నిర్ధారించారు. అనంతరం ఆ పావురాన్నిసంబంధిత ఆర్మీ అధికారులకు అప్పగించారు.

Follow Us
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే