విండీస్‌తో సిరీస్‌కు జట్టు సిద్ధం.. ఆ ఇద్దరు పేసర్లు రీ-ఎంట్రీ!
సొంతగడ్డపై వరుసగా సిరీస్‌లు ఆడుతూ.. అద్భుతమైన విజయాలు అందుకుంటున్న టీమిండియా.. మరికొద్ది రోజుల్లో కరేబియన్లతో పోరుకు సిద్ధం కానుంది. ఇక ఈ సిరీస్ కోసం తలబడబోయే భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలను వెస్టిండీస్‌తో ఆడనుంది. ఈ సిరీస్‌కు పేసర్లు మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్లతో పాటుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తిరిగి పరిమితి ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపికయ్యారు. అంతేకాకుండా చాలారోజుల తర్వాత ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ కూడా […]
సొంతగడ్డపై వరుసగా సిరీస్‌లు ఆడుతూ.. అద్భుతమైన విజయాలు అందుకుంటున్న టీమిండియా.. మరికొద్ది రోజుల్లో కరేబియన్లతో పోరుకు సిద్ధం కానుంది. ఇక ఈ సిరీస్ కోసం తలబడబోయే భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలను వెస్టిండీస్‌తో ఆడనుంది.
ఈ సిరీస్‌కు పేసర్లు మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్లతో పాటుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తిరిగి పరిమితి ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపికయ్యారు. అంతేకాకుండా చాలారోజుల తర్వాత ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇకపోతే టెస్టుల్లో అదరగొడుతున్న మయాంక్ అగర్వాల్‌కు ఛాన్స్ దొరకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్. కాగా, ఇరు జట్ల మధ్య మొదటి టీ20 డిసెంబర్ 6న జరగనుంది.
ALERT?: #TeamIndia for the upcoming @Paytm series against West Indies announced. #INDvWI pic.twitter.com/7RJLc4MDB1
— BCCI (@BCCI) November 21, 2019