నల్ల రూపాయి నోటు- తెల్లమొహం వేసిన నిజాం
చెలామణిలో ఉన్న నోట్లను ఉన్న పళంగా రద్దు చేస్తే ఏమవుతుందో మనకు తెలిసిన విషయమే.. మోదీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో డిమానిటైజేషన్ చేసిందో తెలియదు కానీ ఒక్కోసారి ప్రజల సెంటిమెంట్ కూడా నోట్ల రద్దుకు కారణమవుతుంది.. అలా హైదరాబాద్ రాజ్యంలో జరిగింది… ప్రజలెవ్వరూ నోటును తీసుకోడానికి ఇష్టపడకపోవడంతో నిజాం ప్రభుత్వం అధికారికంగా కరెన్సీ నోట్లను రద్దు చేయాల్సి వచ్చింది… మనదేశంలో ఇలా కరెన్సీ నోట్లు రద్దు కావడం అదే మొదలు… అసలేం జరిగిందంటే… హైదరాబాద్‌ను పాలించిన ఏడో […]

చెలామణిలో ఉన్న నోట్లను ఉన్న పళంగా రద్దు చేస్తే ఏమవుతుందో మనకు తెలిసిన విషయమే.. మోదీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో డిమానిటైజేషన్ చేసిందో తెలియదు కానీ ఒక్కోసారి ప్రజల సెంటిమెంట్ కూడా నోట్ల రద్దుకు కారణమవుతుంది.. అలా హైదరాబాద్ రాజ్యంలో జరిగింది… ప్రజలెవ్వరూ నోటును తీసుకోడానికి ఇష్టపడకపోవడంతో నిజాం ప్రభుత్వం అధికారికంగా కరెన్సీ నోట్లను రద్దు చేయాల్సి వచ్చింది… మనదేశంలో ఇలా కరెన్సీ నోట్లు రద్దు కావడం అదే మొదలు… అసలేం జరిగిందంటే… హైదరాబాద్‌ను పాలించిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కరెన్సీ నోట్ల తయారీకి పూనుకున్నారు.. కారణం ఫస్ట్ వరల్డ్ వార్ కారణంగా లోహాలకు తీవ్ర కొరత ఏర్పడటమే.. అందుకే రాగి. .వెండి నాణేలను కాదని కరెన్సీ నోట్లను ముద్రిద్దామనుకున్నారు.. ఇందుకు బ్రిటిష్ ప్రభుత్వం సలహా తీసుకున్నారు..
అప్పట్లో ప్రిన్స్‌లీ స్టేట్‌గా ఉన్న నిజాం ప్రభుత్వానికి సొంత నాణేలను ముద్రించుకునే వెలుసుబాటు ఉండింది.. నోట్ల ప్రింటింగ్ కోసం హైదరాబాద్ కరెన్సీ యాక్ట్ 1917/1918ను తీసుకొచ్చారు ఉస్మాన్ అలీఖాన్.. జూన్ 4, 1918లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంతకం తర్వాత ఆ యాక్ట్ అమల్లోకి వచ్చింది.. అదే ఏడాది పది, వంద రూపాయల నోట్లను ముద్రించారు.. 1926లో వెయ్యి రూపాయల నోటు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.. అంతా బాగానే ఉంది కానీ.. 19919లో విడుదలైన రూపాయి నోటు పట్లే జనం కాసింత విముఖత చూపించారు.. ఎవరైనా ఇస్తే తీసుకునేవారు కాదు.. రూపాయి వెండినాణమే కావాలనేవారు.. నోటు కంటే వెండి నాణేం విలువ ఎక్కువ కావడం ఓ కారణమైతే … రూపాయి కరెన్సీ నోటు నల్లటి రంగులో ఉండటం మరో కారణం.. అప్పటి హైదరాబాద్ సంస్థానం ప్రజలు నల్లరంగు నోటు తీసుకోవడం అశుభంగా భావించారు.. ప్రింట్ చేసినవి చేసినట్టుగానే ఉండిపోవడంతో ఏడాది తిరక్కుండానే నోటును రద్దు చేసేసింది నిజాం ప్రభుత్వం..
నోట్లను ముద్రించే కాంట్రాక్ట్ పొందిన వాటర్లూ అనే సంస్థ మొత్తం రెండు కోట్ల రూపాయి నోట్లను బాంబేలో ప్రింట్ చేసింది.. బాంబే నుంచి వాటిని తీసుకొస్తుంటే మధ్యలో 608 నోట్లను ఎవరో దొంగలించారు.. సర్కులేషన్‌లోకి 20.92 లక్షల నోట్లు వచ్చాయి… 1,78, 98, 642 నోట్లు ప్రభుత్వం దగ్గరే ఉండిపోయాయి.. మార్చి, 1939లో ఆ నోట్లన్నింటినీ కాల్చేశారు.. అయితే 8, 500 నోట్లు ప్రజల దగ్గర ఉండిపోయాయి.. ఓ అయిదు నోట్లను మింట్‌లో సావనీర్లుగా పదిలపర్చారు.. మరో 245 నోట్లను నిజాం సెంట్రల్ ట్రెజరీలో ఉంచారు.