రేపటి నుంచి రైళ్లు ప్రారంభం.. ప్రయాణీకులకు రైల్వే శాఖ సూచనలు..!

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. అర్తకవ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే

  • Tv9 Telugu
  • Publish Date - 3:25 pm, Sun, 31 May 20
రేపటి నుంచి రైళ్లు ప్రారంభం.. ప్రయాణీకులకు రైల్వే శాఖ సూచనలు..!

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. ఆర్థికవ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక రైలు సర్వీసుల ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ పలు సూచనలు చేసింది. అవేంటంటే..

1. రైలు బయలుదేరడానికి కనీసం 90 నిమిషాల ముందు రైల్వే స్టేషన్ చేరుకోవాలి.

2. అధీకృత ప్రయాణ టిక్కెట్లు ఉన్న వ్యక్తులు మాత్రమే రైల్వే ప్రాంగణం, రైళ్లలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు.

3. ఈ రైళ్లకు రిజర్వు చేయని టిక్కెట్లు ఇవ్వబడవు.

4.కోవిడ్ -19 లక్షణాలతో ఉన్న ప్రయాణికులు, ప్రయాణించడానికి అనుమతించబడదు.

5. రైళ్ల లోపల దుప్పట్లు ఇవ్వబడవు.

6. దయచేసి మీ స్వంతంగా తీసుకెళ్లగలిగే కనీస సామాన్లతోనే ప్రయాణించండి.

7. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు రైళ్ళలో ప్రయాణించకుండా ఉండడం శ్రేయస్కరం.

8. దయచేసి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి అలాగే రైల్వే ప్రాంగణాలు, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు సహకరించండి.

Also Read: త్వరలో.. మార్కెట్లోకి కరోనావైరస్ టెస్ట్ కిట్.. 10 నిమిషాల్లో ఫలితం..