India Vs Australia 2020: కెప్టెన్‌గా స్మిత్‌కు ఇంకో ఛాన్స్ ఎండుకివ్వకూడదు.? సెలెక్టర్లపై ఆసీస్ మాజీ ప్లేయర్ ఫైర్.!

ఆస్ట్రేలియా జట్టు సారధ్య బాధ్యతలను తిరిగి స్టీవ్ స్మిత్ చేపడతాడని కొద్దిరోజులుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఆసీస్...

India Vs Australia 2020: కెప్టెన్‌గా స్మిత్‌కు ఇంకో ఛాన్స్ ఎండుకివ్వకూడదు.? సెలెక్టర్లపై ఆసీస్ మాజీ ప్లేయర్ ఫైర్.!

Updated on: Dec 15, 2020 | 1:36 PM

India Vs Australia 2020: ఆస్ట్రేలియా జట్టు సారధ్య బాధ్యతలను తిరిగి స్టీవ్ స్మిత్ చేపడతాడని కొద్దిరోజులుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ మరోసారి పగ్గాలు చేపడతాడంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సెలెక్టర్లను గిల్‌క్రిస్ట్ కోరాడు. ఎవరికైనా రెండో అవకాశం తప్పనిసరిగా ఇవ్వాలి.? స్మిత్ కెప్టెన్సీ అందుకోవడంలో సెలెక్టర్లకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే.? అతడూ సిద్దంగా ఉంటే.? వెంటనే వైస్ కెప్టెన్‌గా నియమించండి. ఇది జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని గిల్‌క్రిస్ట్ అన్నాడు.

కాగా, 2018 బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏడాది నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. అంతేకాదు అతడిపై రెండేళ్లు కెప్టెన్సీ నిషేదాన్ని కూడా విధించారు. ఇటీవలే ఆ గడువు కూడా ముగిసింది.

Also Read:

తొలి దశలో కోటి మందికి టీకా.. హెల్త్‌కేర్‌ వర్కర్లకే మొదటి ప్రాధాన్యత.. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏపీ ప్రభుత్వం సిద్ధం.!

బిగ్ బాస్ ప్రైజ్ మనీతో ఏం చేస్తారు.? రైతుల కోసం డ‌బ్బు ప‌క్క‌న పెడతానన్న అరియానా.. శభాష్ అంటున్న నెటిజన్లు.!

మగువలకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఫిబ్రవరి 2021 నాటికి రూ. 42,000 చేరుకునే అవకాశం..!