భూతలం నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించే మిసైల్ ప్రయోగాన్ని ఇండియా విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా బాలాసోర్ లోని ప్రయోగకేంద్రం నుంచి ‘క్విక్ రియాక్షన్ సర్ ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టం’ టెస్ట్ ఫైర్ సక్సెస్ అయిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆరు కెనిష్ఠ రైజ్డ్ మిసైల్స్ ని మోసుకుపోగల మొబైల్ లాంచర్ ని వినియోగించి ఈ క్షిపణిని ప్రయోగించారు. సింగిల్ స్టేజ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్ తో కూడిన ఈ క్షిపణి తయారీ కోసం అన్నీ దేశీయ ఉత్పత్తులనే వినియోగించారు. ఈ ఫ్లైట్ టెస్ట్ లో మల్టీ ఫంక్షన్ రాడార్, బ్యాటరీ సర్వేలెన్న్ రాడార్, బ్యాటరీ కమాండ్ పోస్ట్ వెహికల్, మొబైల్ లాంచర్ వంటి అత్యంత ఆధునిక సిస్టమ్స్ ను వాడినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ మిసైల్ భారత ఆర్మీకి ఎయిర్ డిఫెన్స్ విషయంలో ఎంతో తోడ్పడుతుందని ఈ శాఖ వివరించింది.
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డీ ఆర్ డీఓ డైరెక్టర్ సతీష్ రెడ్డి తదితరులు ఈ క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.