Namaste Trump: ట్రంప్ భారత్ పర్యటన.. మీకీ విషయాలు తెలుసా?
భారత స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ ఆశ్రమం కీలకపాత్ర పోషించిందని ట్రంప్ దంపతులకు వివరించారు. కాగా.. భారత్‌కు వచ్చిన ట్రంప్‌తో మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారని..
Namaste Trump: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ముందుగా అహ్మదాబాద్‌కు సమీపంలోని సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. ప్రధాని మోదీ స్వయంగా వారిని ఆశ్రమానికి తీసుకువెళ్లారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ ఆశ్రమం కీలకపాత్ర పోషించిందని ట్రంప్ దంపతులకు వివరించారు. కాగా.. భారత్‌కు వచ్చిన ట్రంప్‌తో మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారని సమాచారం. మరి అవేంటో తెలుసుకుందామా!
1. అమెరికా అధినేత ట్రంప్ పర్యటనలో కీలకం కానున్న రక్షణ ఒప్పందాలు
2. 24 ‘ఎంహెచ్-60(ఆర్) మల్టీ రోల్’ హెలీకాప్టర్లు, 6 ‘ఏహెచ్-64(ఈ) అపాచీ అటాక్’ హెలీకాప్టర్ల కొనుగోలు డీల్
3. 10 హై ఆల్టిట్యూట్ లాంగ్ ఎండ్యూరన్స్ (హేల్) డ్రోన్ల కొనుగోలుకు అవకాశం
4. సాయుధ డ్రోన్లు, దేశ రాజధాని ఢిల్లీ రక్షణకు ఎయిర్ డిఫెన్స్ సిస్టం కొనుగోలుపై చర్చలు
5. పైప్‌లైన్లో ఎంకే-45 127 ఎం.ఎం నావల్ గన్స్, 6 పీ-81 లాంగ్ మారిటైం ప్యాట్రోల్ ఎయిర్‌క్రాఫ్టులు
6. సువిశాలమైన సముద్రీతీర భద్రత కోసం ఎంక్యూ-9 రీపర్, ప్రిడేటర్-బీ హేల్ డ్రోన్ల అవసరం ఉందంటున్న రక్షణశాఖ
7. పీ-81 ఎయిర్‌క్రాఫ్ట్‌లను యాంటీ సబ్-మెరైన్ వార్‌ఫేర్ కోసం, హేల్ డ్రోన్లను సర్వైలెన్స్ కోసం ఉపయోగించే అవకాశం
8. మిస్సైల్, రాడార్ అమర్చిన ప్రిడేటర్-బీ సీగార్డియన్ డ్రోన్ల కొనుగోలుపై దృష్టిపెట్టిన భారత నావికాదళం
9. ప్రిడేటర్-బీ డ్రోన్లకు 40,000 అడుగుల ఎత్తు వరకు 35 గంటల పాటు ఎగరగలిగే సామర్థ్యం. అలాగే 2.1 టన్నుల పేలోడ్ తీసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతం.
పైన తెలిపిన ఒప్పందాలను అమెరికా, భారత్‌తో చేసుకోనుందని సమాచారం.