Donald Trump @ India: మోదీ నామజపమే ట్రంప్ కార్డు!
భారత పర్యటనలో వున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికెళ్ళినా మోదీ నామజపమే చేస్తున్నారు. అహ్మాదాబాద్‌లో సబర్మతి ఆశ్రమంలో గాంధీ సందేశాన్ని వినిపించడమో.. లేక...
Donald Trump thanks PM Modi in Sabarmati register: భారత పర్యటనలో వున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికెళ్ళినా మోదీ నామజపమే చేస్తున్నారు. అహ్మాదాబాద్‌లో సబర్మతి ఆశ్రమంలో గాంధీ సందేశాన్ని వినిపించడమో.. లేక గాంధీకి నివాళులు అర్పించడమో.. లేక ఆశ్రమ సందర్శనలో తన అనుభవాన్ని వెల్లడించడమో చేయకుండా.. కేవలం ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపేందుకే ప్రెసిడెంట్ ట్రంప్ మొగ్గు చూపారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అహ్మదాబాద్ చేరుకున్న డొనాల్డ్ ట్రంప్.. స్వాగత కార్యక్రమాల తర్వాత నేరుగా గాంధీజీ పన్నెండేళ్ళపాటు నివాసమున్న సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు. తన సతీమణి మెలానియాతోడు రాగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గైడెన్స్‌లో ట్రంప్, సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ గాంధీ ఫోటోకు నూలు దండతో నివాళులు అర్పించారు. అక్కడే వున్న చరఖాపై నూలు వడిచేందుకు ప్రయత్నించారు.
ఇక్కడి దాకా బాగానే వున్నా.. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన ప్రముఖులు అక్కడి విజిట్ డైరీలో ఏదో ఒక సందేశాన్నో, అనుభవాన్నో, గాంధీ మెమొరీలో రాయాల్సి వుండగా.. ట్రంప్ మాత్రం అందుకు భిన్నంగా.. మై ఫ్రెండ్ మోదీకి కృతఙ్ఞతలు అంటూ సందేశాన్ని రాశారు. ట్రంప్, మోదీ ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తర్వాత విజిటర్స్ డైరీలో ట్రంప్ రాసిన సందేశాన్ని మీడియాకు ప్రదర్శించారు ఆశ్రమ నిర్వాహకులు.
భారత సందర్శనకు సంబంధించి ప్రధానికి కృతఙ్ఞతలు తెలుపుతూ.. “TO MY GREAT FRIEND PRIME MINISTER MODI – THANK YOU FOR THIS WONDERFUL VISIT” అని రాశారు సబర్మతి ఆశ్రమం విజిటర్స్ డైరీలో. ట్రంప్ గాంధీని విస్మరించినందుకు ఏడవాలో.. మోదీని పొగిడినందుకు నవ్వాలో తెలియని పరిస్థితి పాపం సబర్మతి ఆశ్రమ నిర్వాహకులది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
Read this also: చంద్రబాబుపై సుప్రీంలో మరో కేసు One more case against Chandrababu in Supreme Court