చెస్.. భారత్ – రష్యా సంయుక్త విజయం

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 8:26 PM

చెస్ ఒలింపియాడ్‌లో అనూహ్య ఫలితం వచ్చింది. ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణపతకం గెలుచుకుంది. ఈ మేరకు చదరంగం..

చెస్.. భారత్ - రష్యా సంయుక్త విజయం
Follow us on

చెస్ ఒలింపియాడ్‌లో అనూహ్య ఫలితం వచ్చింది. ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణపతకం గెలుచుకుంది. ఈ మేరకు చదరంగం అంతర్జాతీయ సమాఖ్య(ఫిడె) ప్రకటించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్, రష్యాలు సంయుక్తంగా విజేతలుగా నిలిచినట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మొట్టమొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన చెస్ ఒలింపియాడ్‌లో ఫైనల్‌కు చేరుకుని సంయుక్త విజేతలుగా నిలిచిన రష్యా, భారత్‌ జట్లకు బంగారు పతకాలు ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు అర్కడీ వోర్కోవిచ్ తెలిపారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో రెండో రౌండ్‌లో ఇద్దరు భారతీయ ఆటగాళ్లు నిహాల్ సరీన్, దివ్య దేశ్‌ముఖ్‌లు కనెక్షన్ కోల్పోవడంతో నిర్ణీత సమయానికి ముగించలేకపోయారు. దీనిపై భారత బృందం అధికారికంగా ఫిడెకు అప్పీల్ చేసింది. దీంతో పరిశీలనల అనంతరం ఫిడె అధ్యక్షుడు అర్కడీ వోర్కోవిచ్ భారత్, రష్యాలు రెండింటినీ సంయుక్త విజేతలుగా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రష్యాకు శుభాకాంక్షలు తెలిపారు