భారత్‌పై డాలర్ల వర్షం

విదేశాల నుంచి భారత్‌కు నగదు పంపే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా 2018లో వివిధ దేశాల నుంచి 79 బిలియన్‌ డాలర్లు భారత్‌కు చేరినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక తెలిపింది. దీంతో డాలర్ల రూపంలో అత్యధికంగా సొమ్ము జమ అయిన దేశంగా భారత్‌ మొదటి స్థానంలో నిలిచింది. భారత్‌ తర్వాత చైనా( 67 బిలియన్‌ డాలర్లు), మెక్సికో (36 బిలియన్‌ డాలర్లు), ఫిలిప్పీన్స్‌ (34 బిలియన్‌ డాలర్లు), ఈజిప్ట్‌ (29 బిలియన్‌ డాలర్లు) దేశాలు ఉన్నాయి. ప్రపంచబ్యాంకు […]

భారత్‌పై డాలర్ల వర్షం

Edited By:

Updated on: Apr 09, 2019 | 9:10 PM

విదేశాల నుంచి భారత్‌కు నగదు పంపే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా 2018లో వివిధ దేశాల నుంచి 79 బిలియన్‌ డాలర్లు భారత్‌కు చేరినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక తెలిపింది. దీంతో డాలర్ల రూపంలో అత్యధికంగా సొమ్ము జమ అయిన దేశంగా భారత్‌ మొదటి స్థానంలో నిలిచింది. భారత్‌ తర్వాత చైనా( 67 బిలియన్‌ డాలర్లు), మెక్సికో (36 బిలియన్‌ డాలర్లు), ఫిలిప్పీన్స్‌ (34 బిలియన్‌ డాలర్లు), ఈజిప్ట్‌ (29 బిలియన్‌ డాలర్లు) దేశాలు ఉన్నాయి. ప్రపంచబ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి.

గత మూడేళ్లలో డాలర్ల రూపంలో భారత్‌కు వచ్చే సొమ్ము పెరుగుతూ వస్తోంది. 2016లో 62.7 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2017 నాటికి ఆ మొత్తం 65.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2018లో ఏకంగా 79 బిలియన్‌ డాలర్లకు చేరింది. ‘విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య 14శాతం పెరిగింది. ముఖ్యంగా కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన తమ వారిని ఆదుకునేందుకు అనేక మంది పెద్ద మొత్తంలో సొమ్మును భారత్‌కు పంపారు’ అని ప్రపంచ బ్యాంకు తెలిపింది.