ఐరాస మహిళా ‘కమిషన్’ లో సభ్య దేశంగా ఇండియా ఎన్నిక

మహిళా స్టేటస్ పై ఐరాసలో గల కమిషన్ లో ఇండియతా సభ్య దేశంగా ఎన్నికయింది. ఈ కమిషన్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ లోని విభాగమని, కమిషన్ సభ్య దేశంగా ఎన్నికయ్యేందుకు నిర్వహించిన బ్యాలట్ లో భారత్… ఆఫ్ఘనిస్థాన్, చైనా దేశాలను ఓడించిందని ఐరాసలో భారత శ్వాశ్వత ప్రతినిధి త్రిమూర్తి ట్వీట్ చేశారు. మొత్తం 54 సభ్య దేశాలు ఓటింగ్ లో పాల్గొన్నాయని, చైనా సగం ఓట్లను కూడా పొందలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలో గెలిచిన […]

ఐరాస మహిళా 'కమిషన్' లో సభ్య దేశంగా ఇండియా ఎన్నిక
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 15, 2020 | 1:15 PM

మహిళా స్టేటస్ పై ఐరాసలో గల కమిషన్ లో ఇండియతా సభ్య దేశంగా ఎన్నికయింది. ఈ కమిషన్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ లోని విభాగమని, కమిషన్ సభ్య దేశంగా ఎన్నికయ్యేందుకు నిర్వహించిన బ్యాలట్ లో భారత్… ఆఫ్ఘనిస్థాన్, చైనా దేశాలను ఓడించిందని ఐరాసలో భారత శ్వాశ్వత ప్రతినిధి త్రిమూర్తి ట్వీట్ చేశారు. మొత్తం 54 సభ్య దేశాలు ఓటింగ్ లో పాల్గొన్నాయని, చైనా సగం ఓట్లను కూడా పొందలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలో గెలిచిన ఇండియా వచ్ఛే ఏడాది నుంచి 2025 వరకు ఈ కమిషన్ లో సభ్య దేశంగా ఉంటుంది. ఇది ఒకరకంగా చైనాకు పెద్ద దెబ్బే !

మహిళల భద్రత, సాధికారత తదితర విషయాలను ఈ కమిషన్ అధ్యయనం చేసి వారి వికాసానికి తోడ్పడుతుంది.