దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ ఆపి అన్ లాక్ అమలు చేస్తుండటంతో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 15,413 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4,10,461కి చేరింది. మరో 306 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. ఇండియాలో కోవిడ్-19 వల్ల ఒకే రోజు ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,254కి చేరింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య ప్రభుత్వాలను తీవ్ర కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 13,925 వ్యాధి నుంచి రికవర్ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,27,755కి చేరింది. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,69,451గా ఉంది. రికవరీ రేటు మరింత పెరిగి… 55.5కి చేరుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయం.
కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 1,28,205 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 56,845, ఢిల్లీలో 56,746, గుజరాత్లో 26,737 కరోనా కేసులు నమోదయ్యాయి.