దేశంలో కరోనా కల్లోలం, 24 గంటల్లో 1174 మరణాలు

దేశంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేసిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 96,424 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా కల్లోలం, 24 గంటల్లో 1174 మరణాలు
Follow us

|

Updated on: Sep 18, 2020 | 10:43 AM

దేశంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేసిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 96,424 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో   1,174 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,14,678 చేరగా.. మృతుల సంఖ్య 84372కి చేరింది.

మొత్తం కేసులు 52,14,678 తాజా కేసులు 96,424

మొత్తం మృతులు 84372 కొత్తగా చనిపోయినవారు  1,174

ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 10,17,754

కరోనా నుంచి కోలుకున్నవారు 41,12,551

కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ రికవరీల సంఖ్య కూడా పెరగడం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం రికవరీ రేటు 78.86 శాతానికి పెరిగింది. డెత్ రేటు 1.62 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 87వేల మంది బాధితులు డిశ్చార్జ్‌ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒక్కరోజు వ్యవధిలో ఇంతమంది కోలుకోవడం ఇదే  మొదటిసారి.

Also Read : కన్నతండ్రే సుపారీ ఇచ్చి కొడుకును చంపించాడు !