AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా..టెక్సాస్ ని వణికించిన హరికేన్..’హన్నా’

ఈ సంవత్సరపు తొలి అట్లాంటిక్ హరికేన్ ..'హన్నా' (ఉప్పెన) శనివారం సాయంత్రం టెక్సాస్ ను వణికించింది. భారీ వర్షాలు, వరదలు, తుపాను గాలులతో జనజీవనం స్తంభించింది. కేటగిరీ నెం.1 గా  పరిగణిస్తున్నఈ భారీ తుపాను కారణంగా గంటకు 145 కి.మీ. వేగంతో..

అమెరికా..టెక్సాస్ ని వణికించిన హరికేన్..'హన్నా'
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 26, 2020 | 10:17 AM

Share

ఈ సంవత్సరపు తొలి అట్లాంటిక్ హరికేన్ ..’హన్నా’ (ఉప్పెన) శనివారం సాయంత్రం టెక్సాస్ ను వణికించింది. భారీ వర్షాలు, వరదలు, తుపాను గాలులతో జనజీవనం స్తంభించింది. కేటగిరీ నెం.1 గా  పరిగణిస్తున్నఈ భారీ తుపాను కారణంగా గంటకు 145 కి.మీ. వేగంతో పెను గాలులు వీస్తున్నాయని యు ఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. దక్షిణ టెక్సాస్, ఉత్తర మెక్సికో ప్రాంతాల్లో ఆకస్మిక వరదల వల్ల ప్రాణ, ఆస్థి నష్ఠం విపరీతంగా సంభవించవచ్ఛునని అంచనా.. రేపు  ఈ హరికేన్  ప్రభావం కారణంగా ఆ మెరికాలోని అనేక చోట్ల 45 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కావచ్చునని భయపడుతున్నారు.

అట్లాంటిక్ లో ప్రారంభమైన ఈ ఉప్పెన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్ఛరించింది. సహాయక వ్బృందాలను సంసిధ్దంగా ఉంచింది.

Follow Us