AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెబిట్ క్రెడిట్ వ్యవహారాల్లో ‘ఈమెయిల్’ తో జాగ్రత్త‌

ఆధునిక పరిజ్ఞానంతో ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే అకౌంట్ నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు, లోన్ ద్వారా పొందిన డబ్బు, పెన్షన్ ఇలా ఏదైనా కావొచ్చు… బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులలో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఒక్క ఓటీపీతో అంతా మాయం చేస్తున్నారు. ఒకప్పుడు జేబు దొంగలు ఉండే స్థానంలో ఇప్పుడు ఓటీపీ దొంగలు వచ్చేశారు. ఫోన్ నంబర్లు, ఈమెయిళ్ల ద్వారా ఓటీపీ పొంది అకౌంట్ నుంచి డబ్బులు దోచేస్తున్నారు. ఖాతాదారుడి […]

డెబిట్ క్రెడిట్ వ్యవహారాల్లో 'ఈమెయిల్' తో జాగ్రత్త‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 11, 2019 | 7:47 PM

Share

ఆధునిక పరిజ్ఞానంతో ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే అకౌంట్ నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు, లోన్ ద్వారా పొందిన డబ్బు, పెన్షన్ ఇలా ఏదైనా కావొచ్చు… బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులలో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఒక్క ఓటీపీతో అంతా మాయం చేస్తున్నారు. ఒకప్పుడు జేబు దొంగలు ఉండే స్థానంలో ఇప్పుడు ఓటీపీ దొంగలు వచ్చేశారు. ఫోన్ నంబర్లు, ఈమెయిళ్ల ద్వారా ఓటీపీ పొంది అకౌంట్ నుంచి డబ్బులు దోచేస్తున్నారు.

ఖాతాదారుడి ఈమెయిల్.. అతని ప్రమేయం లేకుండా మార్చేసి.. ఎంచక్కా అకౌంట్ ఖాళీ చేసేస్తున్న మోసం ఒకటి తాజాగా బయటపడింది. ఇలాంటి మోసాలకు బ్యాంకు పాత, ప్రస్తుత సిబ్బందిలో కొంతమంది సహకరిస్తున్నారని సమాచారం. ఓటీపీ నంబర్ రిజిస్టర్ ఈమెయిల్, ఫోన్ నంబర్లకు వస్తుంది. అలా వచ్చే ఓటీపీని మెయిల్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. తద్వారా అకౌంట్ ఖాళీ చేయొచ్చు.

ఇలాంటి మోసాలకు చెక్ పెట్టాలంటే.. ప్రతి ఆరునెలలకొకసారి ఈమెయిల్, ఫోన్ నంబర్లను మార్చుకోవాలంటున్నారు సైబర్ నిపుణులు. అంతేగాక గూగుల్ పే, పేటీయం, అమెజాన్ లాంటి యాప్‌లపను ఉపయోగించిన తర్వాత సైన్ అవుట్/లాగ్ అవుట్ చేయడం మర్చిపోవద్దంటున్నారు. అంతర్జాతీయ ప్రయాణీకులు మినహా మిగిలినవాళ్లు బ్యాంకులు అందిస్తున్న ఇంటర్నేషనల్ డెబిట్/క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బ్యాంకు మోసాలకు సంబంధించి ఫిర్యాదుల విషయాలను ఆలస్యం చేయకుండా బ్యాంకులకు, అంబుడ్స్‌మెన్ దృష్టికి వెంటనే తీసుకు వెళ్లాలని చెబుతున్నారు.

'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..
కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య..
కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య..