AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభాల్ని చేకూర్చే విజయదశమి… జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు?

ప్రపంచానికి మూలమైన పరమాత్మను తెలియజేసే శబ్ధం ప్రణవం (ఓం కారం). దీనిలోని (అ,ఉ,మ) ఆద్యంతాక్షరాలే ‘అమ్మ’గా మారాయేమో! ‘అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా యమ్మ కృతాబ్ధియిచ్చుత మహత్త కవిత్వ పటుత్వ సంపదల్’ అని ప్రార్థిస్తూ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో పూజించే పండుగే విజయదశమి. దుర్గాదేవి మహిషాసురుని సంహరించి లోకాన్ని రక్షిం చిన రోజు విజయదశమి. దసరాని సంస్కృతంలో […]

శుభాల్ని చేకూర్చే విజయదశమి... జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 08, 2019 | 10:32 AM

Share

ప్రపంచానికి మూలమైన పరమాత్మను తెలియజేసే శబ్ధం ప్రణవం (ఓం కారం). దీనిలోని (అ,ఉ,మ) ఆద్యంతాక్షరాలే ‘అమ్మ’గా మారాయేమో!

‘అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా యమ్మ కృతాబ్ధియిచ్చుత మహత్త కవిత్వ పటుత్వ సంపదల్’

అని ప్రార్థిస్తూ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో పూజించే పండుగే విజయదశమి. దుర్గాదేవి మహిషాసురుని సంహరించి లోకాన్ని రక్షిం చిన రోజు విజయదశమి.

దసరాని సంస్కృతంలో ‘దశహరా’అని పిలుస్తారు. అంటే పది జన్మ ల పాపాలను నశింపచేస్తుందని అర్థం. అందుకే దేవీ ఉత్సవాలను దస రా ఉత్సవాలుగా దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఉత్సాహంతో జరుపు కుంటారు. చైత్ర మాసం మొదలుకొని భాద్రపద మాసాంతంలోని ఈ రుతువును వసంతుడని పుంలింగంలో వ్యవహరిస్తారు. అశ్వయుజం నుండి ఫాల్గుణ మాసాంతం వరకు ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మక మైంది. ఈ కాలంలో స్త్రీని అర్చించాలి. కనుక శ్రీ మహావిష్ణువు సోదరి నారాయణిని పూజిస్తారు. ఆమెయే దుర్గగా పిలువబడుతున్న పార్వతి. ప్రకృతి కూడా స్త్రీ రూపమే. ‘ప్ర’ అంటే సత్యగుణం. ‘కృ’ అంటే రజోగు ణం, ‘తి’ అంటే తమోగుణం. ఇలా త్రిగుణాత్మకమైంది ప్రకృతి మాత. దేవీ నవరావూతులలో శక్తి పూజ ప్రధానమైంది. ఈ తొమ్మిది రోజుల పూజలను సాత్వికం, రాజసం, తామసం అనే మూడు విధాలుగా ప్రాచీ న హిందూ సంప్రదాయం విభజించింది. జ్ఞానమయమైన దేవిని మహా సరస్వతిగా ఆరాధించే విధానం మోక్షాన్ని ప్రసాదించే సాత్వికం. మహా కాళిని ఆరాధించడం లక్ష్యసిద్ధిని కలిగించే తామసం. మహాలక్ష్మి, దుర్గ, లలిత వంటి దేవతలను ఆరాధించడం రాజసం, దీని ప్రయోజనం కామ్యసిద్ధి. యోగులు, సాధకులు మోక్షసాధనకై సాత్విక పూజనే ఆచరి స్తారు. నవరాత్రుల తర్వాత విజయానికి ప్రతీకగా జరిపే పండుగ విజ యదశమి. ఇది విశేషమైన రోజు. ఈరోజు దుర్గామాతకు చాలా ప్రియ మైంది కూడా. దుర్గ అంటే దుర్గతులను నశింపజేసేది అని అర్థం.

‘విజయ’దశమి అనడం ఎందుకు?

విజయదశమి నాటి శ్రవణా నక్షత్రోదయ వేళ విజయం కనుక విజయదశమి నాడు ఆరంభించిన కార్యాలన్నీ సిద్ధిస్తాయనే నమ్మకం ప్రజలలో ఉంది. ఆ రోజే అనేక శుభకార్యాలు ప్రారంభించడానికి ఇదే కారణం. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు అమృతం జనించిన శుభదినం కూడా విజయదశమి కావడం విశేషం. సర్వ మానవ సౌభ్రాతృత్వపు ఆలోచనలు మాలో సదా నెలకొనాలని చైతన్య ప్రతీక అయిన జగన్మాతను త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ శమీవృక్షం ఆకులను సేకరించి ఇళ్ళకు తిరిగి వచ్చి పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందుతారు. సమ వయస్కుల కిచ్చి ఒకరి కొకరు హత్తు కుంటారు. మహారాష్ర్టలో ఈ వృక్షాన్ని ‘ఆప్త’అని అంటారు.

‘బంగారం’ అని ఎందుకు అంటం? దాని ప్రయోజనాలు…

జమ్మిచెట్టు లేదా శమీవృక్షానికి సంస్కృతంలో శమీ, శివా, మాంగ ల్య, లక్ష్మీ, శుభదా, పవిత్ర, సురభి అనే పేర్లు వున్నాయి. శమీవృక్షం అగ్నికాంతికి ప్రతీక. ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ శుభకరమైనవే. ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు, చెట్టు బెరడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచెం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసు కుంటే అతిసార వ్యాధి (నీళ్ళ విరేచనాలు) తగ్గుతాయి. జమ్మిపూలు నూరి కషాయం చేసుకొని నీళ్ళు, చక్కెర కలిపి స్త్రీలు తాగితే గర్భకో శానికి చెందిన రోగాలు నయమవుతాయి. జమ్మి ఆకులను మెత్తగా నూరి కురుపులపై, పుండ్లపై పెడితే అవి తగ్గిపోతాయి. ఇలా వివిధ రకాలుగా జమ్మిచెట్టు ఔషధంగానూ ఉపమోగపడుతుంది. అందుకే ఈ చెట్టుకు సురభి (బంగారం) అనే పేరు వచ్చింది. ఈ చెట్టులో ఔషద గుణాలు ఉన్నాయి. కనుకనే పూర్వీకులు విజయదశమి నాడు ఈ చెట్టు ను పూజించే వారేమో! అదే నేటికీ ఆచారంగా కొనసాగుతోంది. అందుకే తోలులా ఎండిన జమీ పత్రాన్ని ‘సువర్ణంగా’భావించి దసరా పండుగ నాడు పిల్లలు, పెద్దలు ‘బంగారం’ అంటూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు. ఆ ఆకులను చాలా రోజులు దాచుకునేవారు కూడా ఉన్నారు.

జమ్మిచెట్టును పూజించడం…

శమీవృక్షం అంటే జమ్మిచెట్టును పూజించడం, పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇంతకీ జమ్మిచెట్టు ప్రత్యేకత ఏమిటో తెలుసా? అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మిచెట్టుపై దాచి, అజ్ఞాతవా సం పూర్తి అవగానే ఆ వృక్షాన్ని పూజించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను ధరించారు. అనంతరం శమీవృక్ష రూపాన ఉన్న ’అపరాజిత’దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయ భేరీ మోగించారు. అంతకన్నా ముందు శ్రీ రాముడు కూడా రావణునిపై దండెత్తే ముందు, అనంతరం విజయదశమినాడు విజయం సాధించిన అనంతరం తన నగరానికి బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.

విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన జమ్మి చెట్టు వద్ద గల అపరాజితా దేవిని పూజించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుకుంటూ చెట్టుకు ప్రదక్షణలు చేయాలి. ఈ శ్లోకాన్ని రాసిన చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి అనుగ్రహంతోపాటు శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. తెలంగాణాలో శమీ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇళ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం’ అని చెప్పి పెట్టి, వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు.  ప్రధానంగా జమ్మి, ఆరె ఆకులను పరస్పరం పంచుకొని, కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్శగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి, కుల, మత, లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని, హృదయాల్ని కలిపే ఐక్యతా రాగానికి ప్రతీకగా భావిస్తారు.