ICICI Salute Doctors: వైద్య వృత్తిలో ఉన్న వారికి భారీగా రుణాలు.. ‘సెల్యూట్‌ డాక్టర్స్‌’ పేరుతో ఐసీఐసీఐ కొత్తగా..

|

Jul 03, 2021 | 12:26 PM

ICICI Salute Doctors: వైద్య వృత్తిలో ఉన్న వారికి దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పలు రకాల ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. సెల్యూట్‌ డాక్టర్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్లతో వైద్యు వృత్తిలో ఉన్న వారికి భారీగా రుణాలు అందించనున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది.

ICICI Salute Doctors: వైద్య వృత్తిలో ఉన్న వారికి భారీగా రుణాలు.. సెల్యూట్‌ డాక్టర్స్‌ పేరుతో ఐసీఐసీఐ కొత్తగా..
Icici Offers
Follow us on

ICICI Salute Doctors: వైద్య వృత్తిలో ఉన్న వారికి దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పలు రకాల ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. సెల్యూట్‌ డాక్టర్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్లతో వైద్యు వృత్తిలో ఉన్న వారికి భారీగా రుణాలు అందించనున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో ఓ వైద్య విద్యార్థి స్థాయి నుంచి ఆసుపత్రి యజమాని వరకు అందరికీ మేలు జరిగేలా ఈ రుణాలను అందించనున్నట్లు ఐసీఐసీఐ లయబిలిటీస్‌ విభాగం హెడ్‌ ప్రణవ్‌ మిశ్రా తెలిపారు. కేవలం వైద్యుల కోసమే ఈ ప్రత్యేక ఆఫర్లు తీసుకొచ్చినట్లు ప్రణవ్‌ చెప్పుకొచ్చారు. నేషనల్‌ డాక్టర్స్‌ డే రోజున ఈ సరికొత్త ఆఫర్లను ప్రకటించారు.

సెల్యూట్‌ డాక్టర్స్‌లో భాగంగా అందిస్తోన్న ఆఫర్లు..

* మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ. 10 కోట్ల వరకు రుణాలను అందించనున్నారు. దరఖాస్తుదారులు ఐసీఐసీఐ కస్టమర్లు కాకపోయినప్పటికీ ఈ సదుపాయాన్ని కల్పించారు. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం హెచ్‌.సి.ఎఫ్‌ అని టైప్‌ చేసి 567677కు ఎస్‌ఎమ్‌ఎస్‌ చేయొచ్చు.
* ఇక ఆసుపత్రి లేదా క్లినిక్‌ మాడిఫికేషన్‌, వైద్య పరికరాల కొనుగోలుతో పాటు ఇతర వ్యాపార సంబంధిత ఖర్చుల కోసం బ్యాంకు వ్యాపారం రుణ రూపంలో రూ. 40 లక్షలు అందించనున్నారు. ఇందులో భాగంగా తక్షణమే రుణ సదుపాయం కల్పించనున్నారు.
* వైద్య వృత్తిలో ఉన్న వారికి రూ. 25 లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇస్తున్నారు. ఇందుకోసం సాధారణ ఆన్‌లైన్ డాక్యుమెంటేషన్ , ప్రాసెసింగ్‌ సరిపోతుంది.
* ‘డాక్టర్ సెలెక్ట్ ఐస్‌మార్ట్ ఎడ్యుకేషన్ లోన్’ పేరుతో ఎడ్యుకేషన్‌లోన్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా రూ. కోటి వరకు రుణం పొందే అవకాశం కల్పించారు. అలాగే రూ. 50 లక్షల వరకు ఆటో లోన్‌ సదుపాయాన్ని కల్పించారు.
* హోమ్‌ లోన్‌లో భాగంగా రూ. 5 కోట్ల వరకు రుణాన్ని అందించనున్నారు. నూతన ఇంటి నిర్మాణదారులకే కాకుండా మార్టేజ్‌, హోమ్‌ లోన్‌ బ్యాలన్స్‌ ట్రాన్స్‌ఫర్‌, లోన్‌ అగేనెస్ట్ ప్రాపర్టీ వంటి అవకాశాన్ని కూడా కల్పించారు.

Also Read: JIO New Offer: జియో కొత్త ఆఫర్.. అత్యవసర సమయంలో డేటా.. డబ్బులు తర్వాత చెల్లించే అవకాశం.

SBI customers ALERT!: SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం ఈ సేవలకు అంతరాయం

LIC Housing Loan: భారీగా హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లను తగ్గించిన ఎల్‌ఐసీ.. వెంటనే త్వరపడండి. ఎందుకంటే ఈ అవకాశం.