ఇది ఎంతో ఆనందకరమైన క్షణం.. భావోద్వేగానికి గురైన అద్వానీ

కొన్ని సంవత్సరాల నుంచి నానుతూ వచ్చిన అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు శనివారం చారిత్రాత్మక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ స్వాగతించారు. సుప్రీం తీర్పుపై స్పందించిన అద్వానీ.. ‘‘ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. ఈ మహోన్నతమైన ఉద్యమంలో పాల్గొనే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. దేశ స్వాతంత్య్ర పోరాటం తరువాత అయోధ్య రామమందిరం కోసం సాగిన ఉద్యమమే ఉన్నతమైంది. అందులో నేను పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. సుదీర్ఘ పోరాటానికి […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:44 am, Sun, 10 November 19
ఇది ఎంతో ఆనందకరమైన క్షణం.. భావోద్వేగానికి గురైన అద్వానీ

కొన్ని సంవత్సరాల నుంచి నానుతూ వచ్చిన అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు శనివారం చారిత్రాత్మక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ స్వాగతించారు. సుప్రీం తీర్పుపై స్పందించిన అద్వానీ.. ‘‘ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. ఈ మహోన్నతమైన ఉద్యమంలో పాల్గొనే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. దేశ స్వాతంత్య్ర పోరాటం తరువాత అయోధ్య రామమందిరం కోసం సాగిన ఉద్యమమే ఉన్నతమైంది. అందులో నేను పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫలితం వచ్చింది’’ అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు అయోధ్య తీర్పు వచ్చిన వెంటనే.. బీజేపీ శ్రేణులు, అద్వానీ అభిమానులు ఆయన కల సాకారమైందంటూ అభిప్రాయపడ్డారు.

కాగా అయోధ్యలోని వివాదాస్పద స్థలంతో రామమందిరం నిర్మించాలని కట్టాలన్న డిమాండ్‌లో ఎల్‌కే అద్వానీ 1990లో రథయాత్ర చేపట్టారు. ఆయన చేపట్టిన యాత్రతోనే మందిర నిర్మాణ ఉద్యమం ఊపందుకోగా.. అద్వానీ బాటలోనే పలు హిందూ సంఘాలు నడిచాయి. ఇక రథయాత్ర ముగింపు సందర్బంగా కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. ఈ కేసులో ఎల్‌కే అద్వానీ సీబీఐ విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఇక దశాబ్దాలుగా సాగిన అయోధ్య వివాదానికి శుక్రవారం సుప్రీం తుది తీర్పు వెల్లడించింది. 1856 నుంచి హిందూ-ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్టప్రకారం ఏర్పాటు చేసే ఆలయ ట్రస్ట్‌కు అప్పగించాలని సుప్రీం, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తంతును మూడు నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం నిర్దేశించింది. ఇదే సమయంలో ముస్లిం మత విశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ.. అయోధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.