AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆమె ఓ హిపోక్రైట్’, జయా బచ్చన్ పై తెలంగాణ బీజేపీ ఫైర్

బాలీవుడ్ లో డ్రగ్ మహమ్మారిపై లోక్ సభలో గళమెత్తిన బీజేపీ ఎంపీ రవి కిషన్ మీద సమాజ్ వాదీ పార్టీ ఎంపీ, మాజీ నటి కూడా అయిన జయాబచ్చన్ ధ్వజమెత్తడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆమె రాజ్యసభలో..

'ఆమె ఓ హిపోక్రైట్', జయా బచ్చన్ పై తెలంగాణ బీజేపీ ఫైర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 2:40 PM

Share

బాలీవుడ్ లో డ్రగ్ మహమ్మారిపై లోక్ సభలో గళమెత్తిన బీజేపీ ఎంపీ రవి కిషన్ మీద సమాజ్ వాదీ పార్టీ ఎంపీ, మాజీ నటి కూడా అయిన జయాబచ్చన్ ధ్వజమెత్తడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆమె రాజ్యసభలో ఓ ‘పూర్తి స్థాయి హిపోక్రైట్’ లా  మారినట్టు కనిపిస్తోందని ఈ పార్టీ అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర రావు విమర్శించారు. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఉన్నా ఆమె పట్టించుకోకుండా ఒక పార్లమెంటేరియన్ గా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. దేశంలో యువత భవిష్యత్తును, ఆమె ఉన్న సినీ పరిశ్రమలోనే అనేకమంది నటీనటుల  కెరీర్లను నాశనం చేస్తున్న డ్రగ్స్ సమస్యపై  ఆమె ఇలా మాట్లాడడం సహేతుకం కాదన్నారు. ఆమె వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. బాలీవుడ్ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర జరుగుతోందంటూ జయాబచ్చన్ రాజ్యసభలో నోటీసు ఇవ్వడం ఎంతో శోచనీయమని కృష్ణసాగరరావు దుయ్యబట్టారు. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్ లలో అనేకమంది పేర్లను ఎన్సీబీ విడుదల చేయడానికి సిధ్దంగా ఉందని ఆయన చెప్పారు.

ఈ ఒక్క స్టాక్‌ ఉంటే ఉద్యోగంతో పన్లేదిక.. అప్పుడు రూ. 44.. ఇప్పుడు
ఈ ఒక్క స్టాక్‌ ఉంటే ఉద్యోగంతో పన్లేదిక.. అప్పుడు రూ. 44.. ఇప్పుడు
కొత్త కాంబినేషన్లు కోరుకుంటున్న కుర్రోళ్ళు
కొత్త కాంబినేషన్లు కోరుకుంటున్న కుర్రోళ్ళు
బాలీవుడ్ కోటలో సౌత్ జెండా..! అక్కడ కూడా మనోళ్లదే డామినేషన్..
బాలీవుడ్ కోటలో సౌత్ జెండా..! అక్కడ కూడా మనోళ్లదే డామినేషన్..
కొత్తగూడెంలో కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్ - సీపీఐ హోరాహోరీ..
కొత్తగూడెంలో కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్ - సీపీఐ హోరాహోరీ..
చాణక్య నీతి: ఈ తప్పులు చేస్తే.. కుటుంబంలో కల్లోలం తప్పదు..!
చాణక్య నీతి: ఈ తప్పులు చేస్తే.. కుటుంబంలో కల్లోలం తప్పదు..!
విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే ప్రైవేట్ స్కూల్స్‌లో ఫ్రీ
విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే ప్రైవేట్ స్కూల్స్‌లో ఫ్రీ
మారుతున్న ట్రెండ్.. డిజిటల్ వైపు అడుగులేస్తున్న టాలీవుడ్ హీరోలు
మారుతున్న ట్రెండ్.. డిజిటల్ వైపు అడుగులేస్తున్న టాలీవుడ్ హీరోలు
Video: టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే మరో బెస్ట్ క్యాచ్..
Video: టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే మరో బెస్ట్ క్యాచ్..
మీ ఇంట్లో ఏనుగు బొమ్మ ఉందా..? ఇలా చేస్తే మీకు రెట్టింపు అదృష్టం.!
మీ ఇంట్లో ఏనుగు బొమ్మ ఉందా..? ఇలా చేస్తే మీకు రెట్టింపు అదృష్టం.!
సింగరేణి గడ్డపై కాంగ్రెస్ హవా.. రామగుండం కార్పొరేషన్‌లో ఘన విజయం
సింగరేణి గడ్డపై కాంగ్రెస్ హవా.. రామగుండం కార్పొరేషన్‌లో ఘన విజయం