అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పాతబస్తీ టప్పచబుత్ర కి చెందిన మొహమ్మద్ మొయిజ్ ఉద్దీన్ షికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కారు వేగంగా డ్రైవ్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. 2015 నుంచి చికాగోలో జాబ్ చేస్తున్న మొయినుద్దీన్, 2019 సెప్టెంబర్ లో చివరిసారిగా హైదరాబాద్ వచ్చాడని మొయిజ్ బంధువులు చెబుతున్నారు.