రోగికి సేవ చేసిన ట్రాఫిక్ పోలీస్.. వీడియో వైరల్

ఎల్బీ‌నగర్ వద్ద ఓ ట్రాఫిక్ పోలీస్ తన ఔదార్యాన్ని చాటాడు. వర్షపు నీటిలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ఓ రోగిని తన బుజాల పై వేసుకుని రోడ్డు దాటించాడు. అతడు చేసిన పనికి స్థానికులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఎల్బీనగర్ కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ పోలీస్.. రోడ్డు అవతలి వైపు కాలికి పెద్ద కట్టుతో.. రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ఓ రోగిని గమనించాడు. వెంటనే అతని వద్దకు వెళ్లి స్వయంగా […]

రోగికి సేవ చేసిన ట్రాఫిక్ పోలీస్..  వీడియో వైరల్
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 8:02 AM

ఎల్బీ‌నగర్ వద్ద ఓ ట్రాఫిక్ పోలీస్ తన ఔదార్యాన్ని చాటాడు. వర్షపు నీటిలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ఓ రోగిని తన బుజాల పై వేసుకుని రోడ్డు దాటించాడు. అతడు చేసిన పనికి స్థానికులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఎల్బీనగర్ కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ పోలీస్.. రోడ్డు అవతలి వైపు కాలికి పెద్ద కట్టుతో.. రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ఓ రోగిని గమనించాడు. వెంటనే అతని వద్దకు వెళ్లి స్వయంగా భుజంపై మోసుకుంటూ రోడ్డు దాటించాడు. అక్కడే ఉన్న కొంతమంది తమ మొబైల్‌లో ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజెన్లు ట్రాఫిక్ పోలీస్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు.