బిక్కుబిక్కుమంటూ హైదరాబాద్ రాత్రులు

వందేళ్ళలో ఇది రెండో సారి అంటే అర్థం చేసుకోవచ్చు. రాజధాని భాగ్యనగంలో కురిసిన వర్షాలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడమేకాదు, ప్రజల్ని భయకంపితుల్ని చేశాయి. ఇంకా చేస్తున్నాయి. నగరంలో బీహెచ్‌ఈఎల్, ఎల్బీనగర్, నిజాంపేట్, అమీర్ పేట్, ఫిల్మ్ నగర్, మణికొండ, మెహదీపట్నం సహా పలు ప్రాంతాల్లో మూడోరోజు రాత్రికూడా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. సిటీలోని అనేక చోట్ల రాత్రంతా కురిసిన భారీ వర్షం కారణంగా వివిధ ప్రాంతాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఏ క్షణాన […]

బిక్కుబిక్కుమంటూ హైదరాబాద్ రాత్రులు
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 15, 2020 | 8:32 AM

వందేళ్ళలో ఇది రెండో సారి అంటే అర్థం చేసుకోవచ్చు. రాజధాని భాగ్యనగంలో కురిసిన వర్షాలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడమేకాదు, ప్రజల్ని భయకంపితుల్ని చేశాయి. ఇంకా చేస్తున్నాయి. నగరంలో బీహెచ్‌ఈఎల్, ఎల్బీనగర్, నిజాంపేట్, అమీర్ పేట్, ఫిల్మ్ నగర్, మణికొండ, మెహదీపట్నం సహా పలు ప్రాంతాల్లో మూడోరోజు రాత్రికూడా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. సిటీలోని అనేక చోట్ల రాత్రంతా కురిసిన భారీ వర్షం కారణంగా వివిధ ప్రాంతాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నట్టుగా భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. వర్షం తీవ్రతకు తలుపుతీసి చూద్దామన్నా చూడలేనంతగా పరిస్థితి నెలకొంది. అనారోగ్యం, లేదా వివిధ సమస్యలతో హాస్పిటల్ కు వెళ్లాలనుకున్న వారి పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఒక వైపు కరెంట్ లేక, కారుచీకటి, కుండపోత వర్షంతో నగరవాసుల రాత్రి అవస్థలు అన్నీఇన్నీ కాకుండా అయ్యాయి.